వైరల్

Delhi Metro: మెట్రోలో ప్రేమికుల రచ్చ.. చుట్టూ మనుషులను మర్చిపోయి మరీ..

Delhi Metro: చుట్టూ ఎవరున్నారనే విషయం మర్చిపోయి ప్రేమికులు చేసే పనులు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాయి.

Delhi Metro: మెట్రోలో ప్రేమికుల రచ్చ.. చుట్టూ మనుషులను మర్చిపోయి మరీ..
X

Delhi Metro: చుట్టూ ఎవరున్నారనే విషయం మర్చిపోయి ప్రేమికులు చేసే పనులు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాయి. కొన్ని జంటలు ప్రేమ చూపించడానికి అయినా, కోపం చూపించడానికి అయినా చుట్టూ ఎవరున్నారనే సంగతి మర్చిపోతారు. తాజాగా ఢిల్లీ మెట్రోలో కూడా అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఢిల్లీ మెట్రోలో ఓ ప్రేమజంట గొడవ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ముందుగా ఆ అమ్మాయి తాను వేసుకున్న టీ షర్ట్ ధర రూ.1000 అని చెప్పగా.. దానికి అబ్బాయి రూ.150 కూడా ఈ టీ షర్ట్ దొరుకుతుంది అని సరాదాగా సమాధానమిచ్చాడు. దాంతో ఆమెకు కోపం వచ్చింది. ముందు, వెనుక చూడకుండా అబ్బాయిని కొట్టడం మొదలుపెట్టింది.

కొట్టడంతో పాటు అమ్మకు చెప్తానంటూ చిన్నపిల్లలాగా మారాం చేసింది. దీంతో సహనం కోల్పోయిన ఆ బాయ్‌ఫ్రెండ్.. నీలాంటి లవర్ ఎవరికీ ఉండకూడదు అని సమాధానమిచ్చాడు. దీంతో మళ్లీ అతడిని కొట్టడం మొదలుపెట్టింది యువతి. ఆ గొడవ జరుగుతుండగానే స్టేషన్ రావడంతో వారిద్దరూ దిగిపోయారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో ఎంటర్‌టైన్మెంట్‌గా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు వాళ్లు ఇలా కావాలనే చేశారేమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడా.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES