ఓ మహిళ "రాజీనామా" ప్రశ్న... సోషల్‌ మీడియాలో వైరల్‌

ఓ మహిళ రాజీనామా ప్రశ్న... సోషల్‌ మీడియాలో వైరల్‌
మూడు రోజుల్లోనే కొత్త జాబ్‌కు రాజీనామా... తన నిర్ణయం సరైందేనా తెలపాలంటూ పోస్ట్‌... సోషల్‌ మీడియాలో వైరల్...

ఓ మహిళ.. మూడు రోజుల్లోనే కొత్త ఉద్యోగం వదిలిపెట్టిందన్న‍(Woman Quits New Job‌) వార్త సోషల్‌ మీడియా(social media)లో వైరల్‌(viral)గా మారింది. ఇంతకీ తాను చేసిందో తప్పో.. ఒప్పో చెప్పాలంటూ(she was justified) ఆ మహిళ పోస్ట్‌ చేసింది. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే రాజీనామా చేయడం వెనక ఉన్న కారణాలను వివరిస్తూ ఆ మహిళ సామాజిక మాధ్యమాలు పోస్ట్‌ చేసింది. తాను ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానేమో‍(quitting the job‌) చెప్పాలంటూ నెటిజన్లను సలహా అడిగింది. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం ఎప్పుడూ ఉత్తేజంగా‍(new job is always exciting‌) ఉంటుంది. కానీ ఒక్కోసారి అది అనుకున్నంత సులువుగా ఉండకపోవచ్చు. కొత్త వ్యక్తులను కలవడం, కొత్త పాత్రను నిర్వహించడం, నూతన బాధ్యతలు నేర్చుకోవడం, కొత్త వాతావరణానికి అలవాటు పడడం సవాలుగా ఉంటుంది. ఇలాంటివన్నీ సాధారణమైనా.. మనం పనిచేసే దగ్గర బాస్‌ ఎలా ఉంటాడన్న దానిపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. బాస్ మద్దతు లేకపోతే, సున్నితత్వం లేని వ్యక్తి అయితే మనం అదనపు ఒత్తిడిని అనుభవిస్తాం. ఇదే అనుభవాన్ని ఒక మహిళ రెడ్డిట్‌లో పోస్ట్‌ చేసింది. తాను కొత్త ఉద్యోగంలో చేరిన 3 రోజుల్లోనే ఆ జాబ్‌ను ఎందుకు విడిచిపెట్టానో వివరిస్తూ పోస్ట్‌ చేసింది.


తన యజమాని తనకు ఎలాంటి పనులు అప్పగించలేదని, అయినా పని చేయనందుకు తనను అకారణంగా తిట్టాడని ఆ మహిళ పోస్ట్‌లో వివరించింది. పని చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నావని, చాలా నెమ్మదిగా పనిచేస్తున్నావని అకారణంగా దూషించాడని ఆ పోస్ట్‌లో రాసింది. తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు బాస్ తనను మరింత మందలించాడని పోస్ట్‌లో పేర్కొంది. ఇంటర్వ్యూలోనే తనకు ఈ ప్రాబ్లెమ్‌ ఉందని ఎందుకు చెప్పలేదని బాస్‌ తనను ప్రశ్నించాడని ఆమె తెలిపింది.

తాను బాస్‌తో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు.. అనవసరంగా వాదించవద్దని తనకు వార్నింగ్‌ ఇచ్చాడని ఆ మహిళ పేర్కొంది. అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు సమయం ఇస్తున్నట్లు బాస్‌ తనకు చెప్పాడని, రేపటి వరకు అవసరం లేదు ఇప్పుడే రిజైన్‌ చేస్తున్నానని తాను అతనికి చెప్పినట్లు ఆ మహిళ పోస్ట్‌లో వివరించారు.

ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ఆమె బాస్‌ మరీ అంత క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని రిప్లై చేస్తున్నారు. ఉద్యోగం మానేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదని చాలామంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

Tags

Next Story