Bhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!

Bhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
Bhubaneswar : పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కొత్త పెళ్ళికొడుకు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.. ఒడిశా భువనేశ్వర్ కి చెందిన శుభ్రాన్షు సమాల్. సిస్రాల వివాహం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

Bhubaneswar : పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కొత్త పెళ్ళికొడుకు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.. ఒడిశా భువనేశ్వర్ కి చెందిన శుభ్రాన్షు సమాల్. సిస్రాల వివాహం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అయితే పెళ్లి వేదిక వద్దకు తాను సైకిల్ పై వస్తానని వరుడు చెప్పగా, వధువు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు.

పెళ్లి బట్టలు వేసుకుని శుభ్రాన్షు సైకిల్‌పై కిలోమీటరు దూరం ప్రయాణించాడు. అతని స్నేహితులు కాలినడకన పెళ్లిమండపానికి చేరుకున్నారు. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా శుభ్రాన్షు వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

47 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటున్నశుభ్రాన్షు స్థానికంగా ఓ కిరాణ షాపునడుపుతున్నాడు. కాగా గురువారం భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.56గా ఉండగా, డీజిల్ ధర రూ.102.24గా ఉంది.

Tags

Next Story