వరుడు జంప్.. పెళ్ళికి వచ్చిన అతిధే అల్లుడయ్యాడు!

వరుడు జంప్.. పెళ్ళికి వచ్చిన అతిధే అల్లుడయ్యాడు!
సరిగ్గా పెళ్లి ముహూర్తానికి వరుడు కనిపించకపోవడంతో పెళ్ళికి అతిధిగా వచ్చిన అతనే పెళ్లికోడుకయ్యాడు. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

సరిగ్గా పెళ్లి ముహూర్తానికి వరుడు కనిపించకపోవడంతో పెళ్ళికి అతిధిగా వచ్చిన అతనే పెళ్లికోడుకయ్యాడు. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిక్‌ మంగళూరు తారికారే తాలుకాలో సింధు, నవీన్‌ అనే యువతీయువకులకు ఈరోజు (మంగళవారం) పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బంధువులంతా వచ్చేశారు. కాసేపట్లో పెళ్లనగా ఆకస్మాత్తుగా వరుడు నవీన్‌ కనిపించకుండా పోయాడు. అప్పటికే నవీన్ కి వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడంతో, ఆ యువతి పెళ్లి ఆపేస్తానంటూ బెదిరిచిట్టు సమాచారం.

దీనితో భయపడిపోయిన నవీన్‌ పెళ్లి మండపం నుంచి పరారయ్యాడు. పీటల మీదా ఆడపిల్లమ పెళ్లి ఆగిపోవడం మంచిది కాదని అందరూ ఆందోళన చెందారు. ఈ క్రమంలో పెళ్ళికి అతిధిగా వెళ్ళిన చంద్రు అనే వ్యక్తి సింధును పెళ్లి చేసుకోటానికి ముందుకు రావడంతో పెద్దలు వారికి పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే కొన్నిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని మహాబుబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ వధువు పీటల మీదా పెళ్లపగా, పెళ్లి చూసేందుకు వచ్చిన యువతి పెళ్లి కూతురు అయింది.

Tags

Next Story