వైరల్

Odisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు

Odisha : మరికాసేపట్లో అయితే వరుడు తాళి కడుతాడు అనగా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది వధువు.

Odisha  : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
X

Odisha : మరికాసేపట్లో అయితే వరుడు తాళి కడుతాడు అనగా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది వధువు.. పెళ్లి పీటల పైన పెళ్లికి నిరాకరించడంతో పెళ్లి కొడుకు అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తాళి కట్టే సమయానికి తనకి ముందే పెళ్లి అయిందని, తాను మళ్లీ పెళ్లి చేసుకోలేను వధువు చెప్పింది.

కూతురు చేసిన నిర్వాకానికి ఏం చేయాలో తెలియక ఆమె తల్లిదండ్రులు ఆమెను కొట్టి పెళ్ళికి ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మే 13న జరిగినప్పటికీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరుసటి రోజున ఆ వరుడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

Next Story

RELATED STORIES