ఆ వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇది..!

ఆ వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇది..!
ఓ పెళ్లి వేడుక‌లో ఓ ఫోటోగ్రాఫ‌ర్.. పెళ్లి కొడుకుని పక్కన పెట్టి కేవలం వ‌ధువుపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి.. అదే పనిగా ఆమెనే ఫోటోలు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..

ఓ పెళ్లి వేడుక‌లో ఓ ఫోటోగ్రాఫ‌ర్.. పెళ్లి కొడుకుని పక్కన పెట్టి కేవలం వ‌ధువుపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి.. అదే పనిగా ఆమెనే ఫోటోలు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అదే పనిగా వధువుని ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫ‌ర్ ను గమనించిన ఆ వరుడు.. ఒళ్ళు మండి ఫోటోగ్రాఫ‌ర్ మెడ‌పై ఒక్క‌టి ఇస్తాడు. దీనితో వ‌రుడు చేసిన ప‌నికి వ‌ధువు కింద కూర్చుని పగలబడి నవ్వుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


కేవలం 45 సెకన్లు ఉన్న ఈ వీడియోని వారం రోజుల్లో మిలియన్‌ మంది చూశారు. ఆ వీడియోను రేణుక మోహన్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఇది నిజంగా జరిగిన వీడియోనేనా లేకా షూటింగా అని చాలా మందికి అనుమానం వచ్చింది. తాజాగా దీనిపైన ఆ వీడియోలో తెగ నవ్విన పెళ్లి కూతురు స్పందించింది. , ఇది నిజం పెళ్లి వీడియో కాదనీ, సినిమా షూటింగ్‌ అని చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఆ నటి పేరు ఏంటంటే.. అనుకృతి చౌహాన్.. ఛత్తీస్‌ఘడ్‌ నటి. 'డార్లింగ్‌ ప్యార్‌ ఝుక్తా నహీ' అనే సినిమాకోసం చేసిన వీడియోనే అది అని చెప్పుకొచ్చింది.


Tags

Read MoreRead Less
Next Story