Kacha Badam: కచ్చా బాదం పాటకు పోలీసుల స్టెప్పులు.. వీడియో వైరల్..

Kacha Badam: సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే అది ఎక్కువ సమయం పట్టదు. అలాంటి కొన్ని ట్రెండింగ్స్ వల్లే చాలామంది సెలబ్రిటీల స్థాయి వరకు వెళ్లారు. ఇటీవల కాలంలో ఓ కచ్చా బాదం అమ్ముకునే వ్యక్తి.. తన బిజినెస్ కోసం ఓ పాటను క్రియేట్ చేశాడు. అది అనుకోకుండా విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దానికి నెటిజన్లు వేస్తున్న స్టెప్పులు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ కచ్చా బాదం ఫీవర్ ఇంకా తగ్గనట్టే అనిపిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుండి స్టార్ సెలబ్రిటీల వరకు చాలామంది కచ్చా బాదం పాటకు స్టెప్పులేశారు. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో.. దానికి తగినట్టుగా స్టెప్పులు కూడా అంతే హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే మోస్ట్ ట్రెండింగ్ సాంగ్‌గా ఉంది. తాజాగా పోలీసులు కూడా కచ్చా బాదం సాంగ్‌కు స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్నారు.
క్షణం తీరిక లేకుండా పనిచేసే డిపార్ట్‌మెంట్‌లలో పోలీసులు కూడా ఒకరు. అయితే వీరు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటారు. తాజాగా కచ్చా బాదం సాంగ్‌కు స్టెప్పులేశారు కొందరు పోలీసులు. అందులో ఒక మహిళా పోలీసు కూడా ఉంది. 'పోలీసులకు ఎందుకు ఫన్ ఉండకూడదు' అని క్యాప్షన్ పెడుతూ ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
Why shouldn't khaki have some fun. Watch out on left and right most. pic.twitter.com/izKTzrq0Sm
— Da_Lying_Lama🇮🇳 (@GoofyOlives) March 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com