Haryana: చిరుత పంజాలో పోలీసులు.. అయినా ధైర్యంగా..

Haryana: చిరుత పంజాలో పోలీసులు.. అయినా ధైర్యంగా..
Haryana: హర్యానాలోని పానిపట్‌ జిల్లా బెహ్రాంపూర్‌ గ్రామంలో చిరుతపులి సంచారం గ్రామస్తులను భయపెట్టింది.

Haryana: పోలీస్ వృత్తి అంటే దానికి ఎంతో సాహసం కావాలి. ఎదురుగా చిరుత వచ్చి నిలబడిన దానిని ధైర్యంగా ఎదిరించగలగాలి. ఇవన్నీ మాటలకే పరిమితం అనుకుంటారు కొందరు. కానీ కాదు.. ఇలా సాహసంతో ముందడుగు వేసే పోలీసులు కూడా ఉంటారు. నిజంగానే చిరుతకు ఎదురెళ్లే పోలీసులు కూడా ఉంటారు. దానికి ప్రూఫ్‌గా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హర్యానాలోని పానిపట్‌ జిల్లా బెహ్రాంపూర్‌ గ్రామంలో చిరుతపులి సంచారం గ్రామస్తులను భయపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులిని పట్టుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ చిరుత ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. గోళ్లతో వారి చర్మంపై రక్కింది.

చిరుత దాడి చేసినా కూడా వెనకడుగు వేయని అధికారులు దానిని బంధించారు. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారితో పాటు ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. ఈ వీడియోను ఓ పోలీస్ అధికారి తన ట్విటర్‌లో షేర్ చేయడంతో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. 'అటవి శాఖ అధికారులకు, పోలీసులకు ఈరోజు కఠినమైన రోజు. వారి ధైర్యానికి సెల్యూట్. చిరుతో సహా అందరూ క్షేమంగానే ఉన్నారు.' అని ట్వీట్‌కు క్యాప్షన్‌ను కూడా జతచేశారు.


Tags

Read MoreRead Less
Next Story