Video Viral: నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో నా కూతురే పైలెట్: తండ్రి భావోద్వేగం

Video Viral: నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో నా కూతురే పైలెట్: తండ్రి భావోద్వేగం
Video Viral: తాము కనిపెంచిన బిడ్డ తమ కళ్ల ముందే తమకంటే ఉన్నతంగా ఎదిగి ఆ తల్లిదండ్రులు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. అలాంటి ఓ అపురూప దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Video Viral: తాము కనిపెంచిన బిడ్డ తమ కళ్ల ముందే తమకంటే ఉన్నతంగా ఎదిగి ఆ తల్లిదండ్రులు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. అలాంటి ఓ అపురూప దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైలట్ అయిన కూతురు అదే విమానంలో తన తండ్రిని కూడా తీసుకెళ్లింది. విమానంలో ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. తండ్రి ప్రేమతో కూతురిని హగ్ చేసుకుని మురిసిపోయారు. ఈ అపురూప క్షణాలను అందరితో పంచుకుంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్ క్రుతద్న్యా హేల్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 మిలియన్లకు పైగా వీక్షించారు.


" నేను ఇంటి నుంచి బయలుదేరే ముందు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళను. కొన్నిసార్లు నేను తెల్లవారుజామునే డ్యూటీకి వెళ్లిపోవాల్సి వస్తుంది. అప్పుడు నా తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉంటారు. 3-4 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను. అయినప్పటికీ నేను వారి పాదాలను తాకకుండా ఇంటి నుండి బయలుదేరడం అసంపూర్ణంగా ఉంటుంది " అని ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.



హృదయాన్ని కదిలించే ఈ వీడియో నెటిజన్లకు నచ్చింది. "హాయ్ క్రుతద్న్యా మీరు మీ తల్లిదండ్రులకు బాధ్యతగల కుమార్తె మాత్రమే కాదు. విమానయాన సంస్థకు బాధ్యతాయుతమైన పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నందుకు అభినందనలు. ఇప్పుడు మీరు దేశానికి బాధ్యతగల కుమార్తె. ఒక రోజు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఒక నెటిజన్ పోస్ట్ పెట్టారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది.. అని మరొక నెటిజన్ రాసుకొచ్చారు.

Tags

Next Story