Viral Photo: ఈ ఒక్క ఫొటో తీసేందుకు 7 గంటలు పట్టిందట..!
Viral Photo: : సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. చూపు తిప్పుకోకుండా చేస్తాయి.. అలాగే ఇప్పుడో ఫోటో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోటోను చూసిన ప్రతిఒక్కరూ వావ్ అంటున్నారు. కెన్యాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డస్టెయిన్ తీసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులో మూడు చిరుత పులులు మూడు వైపులకు చూస్తుండగా తన కెమెరాలో బంధించాడు. అయితే ఈ క్షణం కోసం అతడు ఏకంగా 7 గంటలు వర్షంలో తడుస్తూ ఎదురుచూశాడట.. కెన్యాలోని మసాయి మారా షనల్ పార్క్‌లో ఈ ఫొటోను తీశాడు పాల్ గోల్డస్టెయిన్ .
ఈ ఫొటోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేస్తూ.. ఇలాంటి క్షణాలు మంత్రముగ్ధులను చేస్తాయి.. ఈ అద్భుతమైన ఫోటోను క్లిక్ చేయడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చాడు. ఫోటో వైరల్ కావడంతో అతడిని చాలా మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ పేషెన్స్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com