Heroines Honeymoon pics.. టాప్ హీరోయిన్లు హనీమూన్ కోసంఎక్కడికి వెళ్లారో తెలుసా!

Heroines Honeymoon pics
Heroines Honeymoon pics:
సెలబ్రెటీలు ఏం చేసినా సెన్సేషనే..తుమ్మినా..దగ్గినా వార్తే.. మరి పెళ్లి చేసుకుంటే.. ఇక సోషల్‌మీడియా కోడై కూస్తుంది. వాళ్లకు మ్యాచ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి హనీమూన్ వెళ్లే వరకు అన్ని ముచ్చట్లు ట్రెండింగ్ టాపిక్ అవ్వాల్సిందే. ఎంగేజ్మెంట్, మెహందీ, సంగీత్, పెళ్లి తంతు, వాళ్లు హానీ మూన్‌కి వెళ్లి ఇంటికి వచ్చిందాకా కెమెరా కళ్లు వారినే పరికిస్తుంటాయి. ఇక హీరోయిన్లకు పెళ్లైతే హడావిడి మాములుగా ఉండదు. వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఫ్యాన్స్ కూడా వాళ్ల నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి వాళ్ల హనీమూన్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
మెగా హీరోయిన్ నిహారిక డిసెంబర్ 9, 2020న జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహాం ఘనంగా జరిగింది. తరువాత ఈ కొత్త దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు చెక్కేశారు. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది నిహారిక. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి.
ఈ మధ్యే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోంది. పెళ్లయిన తరువాత హనీమూన్‌కి అని ఈ కొత్త జంట మాల్దీవులకు చెక్కేశారు. ప్రపంచంలోనే మొట్టమొదట నీటి అడుగున ఉన్న.. మురాకా హోటల్లోనే ఈ జంట పది రోజులపాటు బస చేశారు. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది కాజల్. ఆమె చేసిన ప్రతి పోస్ట్‌ని, ప్రతి ఫోటోని అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.
టాలీవుడ్‌లో లవ్లీ కఫుల్స్ అయిన నాగ చైతన్య, సమంత జంట గోవాలో వివాహాం చేసుకున్నారు. అక్టోబర్ 6, 2017న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడి.. అక్టోబర్ 8న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. తరువాత ఈ జంట హనీమూన్‌కి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి స్కాట్లాండ్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
లండన్‌లో ఉన్నప్పుడు సమంత కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
దిశా పటాని.. సినిమాలతోనే కాదు.. హాట్ ఫోటోలతోనూ నెట్టింట హల్‌చల్ చేస్తుంటుంది. తన పార్ట్‌నర్ టైగర్ ష్రాఫ్‌తో రీసెంట్‌గా మాల్దీవుల్‌కి వెళ్లి రచ్చ చేసింది. ఈ అమ్మడుకు పెళ్లైందా కాలేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ హాట్ బ్యూటీ టూర్లు.. అక్కడ దిగే ఫోటోలు మాత్రం నెటిజన్స్‌కు నిద్ర పట్టనివ్వవు.
సింగర్ సునీత.. జనవరి 9న మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని మనువాడింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. తరువాత సునీత తన భర్తతో కలిసి అందమైన ప్రదేశం మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వేసింది. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com