Himanta Biswa Sarma: ఐఏఎస్ అధికారిపై విరుచుకుపడిన అస్సాం సీఎం.. అసలు కారణం ఏంటంటే..

Himanta Biswa Sarma: ఐఏఎస్ అధికారిపై విరుచుకుపడిన అస్సాం సీఎం.. అసలు కారణం ఏంటంటే..
X
Himanta Biswa Sarma: హిమంత బిస్వా శర్మ.. నాగోన్ డిప్యుటీ కమీషనర్ నిసర్గ్ హివరేను జనవరి 15న బహిరంగంగా మందలించారు.

Himanta Biswa Sarma: ఐఏఎస్ అధికారి అంటే జిల్లా అంతా గౌరవిస్తారు. వారికి ప్రజలలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఐఏఎస్ అధికారులు. అలాంటి ఐఏఎస్ అధికారిని ఒక్క చిన్న కారణం వల్ల అందరి ముందు తిట్టేశాడు ఓ సీఎం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. నాగోన్ డిప్యుటీ కమీషనర్ నిసర్గ్ హివరేను జనవరి 15న బహిరంగంగా మందలించారు. ఎన్‌హెచ్ 127పై సీఎం కాన్వాయ్ వెళ్లడం కోసం ట్రాఫిక్‌ను నిలిపేశారు అధికారులు. దానికి ఆగ్రహించిన హిమంత బిస్వా.. నిసర్గ్‌పై ఆగ్రహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

అలా సీఎం కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, హిమంత బిస్వా చేసిన పని కరెక్టే అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం కారణం ఏదైనా ఓ ఐఏఎస్‌పై అలా ఆగ్రహించడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన హిమంత బిస్వా.. తాను ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని స్పష్టం చేశారు.


Tags

Next Story