నా ఇష్టం అంటున్న OTT.. తోక కత్తిరిస్తామంటున్న పలు దేశాలు?

OTT
OTT platforms..
పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంటర్ టైన్మెంట్‌ని వద్దనుకునే వారుంటారా.. నిత్యం ఏదోఒక పనితో బిజీగా ఉండే వారు.. కాస్త తీరిక దొరికితే చాలు.. ఎంటర్‌టైన్మెంట్ కోసం తహతహలాడిపోతుంటారు. ఇక హాలీడే వస్తే.. సరదాగా థియేటర్‌కి వెళ్లి ఓ మూవీని ఎంజాయ్ చేసి వస్తారు. అయితే ఇటీవల కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంటర్‌టైన్మెంట్ ప్రియులందరూ.. ఓటీటీల వైపు ముగ్గు చూపారు. దీంతో ఈ మధ్య కాలంలో OTT రంగం బాగా పాపులర్ అయింది.
పెద్ద పెద్ద సినిమాలు.. ప్రోగ్రాములు అన్నీ ఈ ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. థియేటర్లకు అనుమతులు లభించినా కూడా ఓటీటీల పాపులారిటీ అసలు తగ్గలేదు.
అయితే మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. మంచి 30% ఉంటే.. చెడు 70% వరకు ఉంటోంది. అంటే కొన్ని చెత్త చెత్త వీడియోలు ఓటీటీల్లో రావటం స్టార్ట్ అయ్యాయి. దీని వల్ల ఓటీటీలో కొన్ని షోలు ఫ్యామీలీ మొత్తం కూర్చొని చూసే విధంగా లేవనే విమర్శలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ + హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్‌పై వస్తున్న పలు ఫిర్యాదులపై భారతదేశం స్పందించింది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించాలని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల 'దుర్వినియోగాన్ని' అరికట్టడానికి ఓ అడుగు ముందుకేసిన కేంద్ర ప్రభుత్వం.. సోషల్ మీడియా, ఓవర్-ది-టాప్ (OTT) స్ట్రీమింగ్ సేవలతో సహా డిజిటల్ కంటెంట్‌ను కంట్రోల్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
వీటి స్వీయ నియంత్రణ కోసం.. మూడు స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది సర్కార్.
లెవెల్ I: ప్రచురణకర్తల ద్వారా స్వీయ నియంత్రణ
లెవెల్ II: ప్రచురణకర్తలు స్వీయ నియంత్రణ.. సంస్థలు స్వీయ నియంత్రణ
లెవెల్ III: ఓవర్సైట్ విధానం.
స్వీయ నియంత్రణ కోసం.. పలు దేశాలు OTTతో ఎలా వ్యవహరిస్తున్నాయంటే..!
సింగపూర్ :
ద్వీప దేశంగా పిలవబడే ఇక్కడ.. ఇన్ఫోకామ్ మీడియా డెవలప్‌మెంట్ అథారిటీ (IMDA) ఒక సంస్థను కలిగి ఉంది. దీనికి సర్వీసు ప్రొవైడర్లు లైసెన్స్ పొందవలసి ఉంటుంది. అయితే OTT సేవలకు వర్గీకరణ మరియు రేటింగ్‌లు మరియు నిషేధిత కంటెంట్ యొక్క వివరణాత్మక జాబితాను నిర్ధారించే కంటెంట్ కోడ్ ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే, ఏజెన్సీ కంటెంట్‌ను ఉపసంహరించుకోవచ్చు మరియు జరిమానాలు విధించవచ్చు.
అమెరికా :
2019 లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై కంటెంట్‌ను పర్యవేక్షించడానికి కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కోసం ప్రతిపాదన వచ్చింది. యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) నిబంధనలు "అనవసరమైనవి మరియు భారీగా" ఉన్నాయని, అయితే మరింత ఆచరణాత్మక నిబంధనలను ప్రవేశపెట్టాలని కూడా కోరుతున్నాయి.
ఆస్ట్రేలియా :
సాంప్రదాయ మీడియా కోసం ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ అండ్ మీడియా అథారిటీ (ACMA) కాగా, డిజిటల్ మీడియా కోసం 'ఇ-సేఫ్టీ కమిషనర్' ఉంది. దేశంలోని కంటెంట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ యాక్ట్, 1992 చే నియంత్రించబడుతుంది, దీనిలో వివరణాత్మక మార్గదర్శకాలు, ఫిర్యాదు విధానం మరియు నిషేధించబడిన "తిరస్కరించబడిన వర్గీకరణ" ఉన్నాయి.
ఐరోపా :
ప్రస్తుతం ఒక నిర్దిష్ట నియంత్రణ లేనప్పటికీ.. అక్రమ ఆన్‌లైన్ కంటెంట్‌ను పరిష్కరించడానికి సిఫార్సులు ఉన్నాయి. "ఇంటర్నెట్‌లో చట్టవిరుద్ధమైన మరియు హానికరమైన కంటెంట్" పై యూరోపియన్ యూనియన్ పేపర్ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను జాబితా చేసింది మరియు కొన్ని తనిఖీ చేయవలసిన కంటెంట్‌గా ఆకట్టుకునే మైనర్లకు ముప్పుగా ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com