Husband Vs Mutton: 'మటన్ కావాలా.. మొగుడు కావాలా..'
Husband Vs Mutton: భోజన ప్రియులు అనే మాట వినే ఉంటారు కదా.. ఇప్పుడిప్పుడే దీనికి స్టైల్‌గా ఫుడీ అనే పేరు కూడా పెట్టుకున్నారు. వీరికి తినడం అంటే అమితమైన ఇష్టం. ఎవరు పక్కన ఉన్నా లేకపోయినా.. అవేవి పట్టించుకోకుండా వీరి పూర్తి ధ్యాస ఆహారంపైనే ఉంటుంది. మనుషులకంటే ఎక్కువగా వీరు ఫుడ్‌నే ఇష్టపడతారు. ఇటీవల నవదంపతులకు ఇలా ఫుడ్ విషయంలోనే గొడవ జరిగింది. కానీ దాని వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది.
కొన్ని కుటుంబాల్లో మాంసాహారం అలవాటు ఉండదు. కానీ ఈకాలంలో బయట తినడం అలవాటు అయినవారు అప్పుడో ఇప్పుడో ఇంట్లో వారికి తెలియకుండా మాంసాహారాన్ని తినడం మొదలుపెట్టేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈ అమ్మాయి కూడా అంతే.. ఇంట్లో వారికి తెలియకుండా బయట మటన్‌కు అలవాటు పడింది. ఆ టేస్ట్‌ను వదులుకోలేక దొంగచాటుగా అప్పుడప్పుడు తింటూ ఉండేది.
ఇంతలోనే ఆమెకు పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. తనకు కాబోయే భర్తతో తనకు మటన్ తినే అలవాటు ఉందని ముందే చెప్పింది ఆ అమ్మాయి. ఇరువురివి మాంసాహారం ముట్టని కుటుంబాలు కావడంతో అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేని అబ్బాయి.. ఇంకెప్పుడు తను మటన్ ముట్టకూడదని కండీషన్ పెట్టాడు. అమ్మాయి ఆ కండీషన్‌కు ఒప్పుకుంది. వారి పెళ్లి సజావుగా జరిగిపోయింది.
కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నారు. కానీ భార్యకు మళ్లీ మటన్ తినాలన్న కోరిక మొదలయ్యింది. అందుకే మరోసారి ఇంట్లో వారికి తెలియకుండా తినడం మొదలుపెట్టింది. భర్తకు తెలిస్తే కోప్పడతాడని భయపడి తనకు కూడా చెప్పలేదు. కానీ కొంతకాలం తర్వాత ఈ విషయం భర్తకు తెలిసిపోయింది. భార్య మీద కోప్పడిన భర్త.. 'నీకు మటన్ కావాలా.? నేను కావాలా.?' అని నేరుగా అడిగేశాడు. దానికి భార్య ఏ సమాధానం ఇవ్వలేదు.
మౌనంగా ఉన్న భార్యను చూసి భర్తకు భయం మొదలయ్యింది. ఒకవేళ తాను మటనే ముఖ్యమని తనను వదిలేస్తే ఎలా అన్న సందేహం తనను వెంటాడింది. దీంతో వెంటనే ఈ సమస్య గురించి ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లేఖ రాశాడు భర్త. దానికి కౌన్సిలర్ సమాధానం కూడా ఇచ్చాడు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో మీరు మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారని భర్తను ఉద్దేశించి అన్నాడు. ఇక్కడ ఓ అమ్మాయి మనిషి కావాలో, మేక కావాలో డిసైడ్ చేయనుందని చెప్పారు. ప్రేమించిన వ్యక్తి లేకుండా అయినా బ్రతకవచ్చు కానీ ఆహారం లేకుండా బ్రతకలేం కదా అని తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ సంభాషణ ఎంత వైరల్‌గా మారిందంటే.. ఒక ఇంగ్లీష్ పేపర్‌లో దీనిపై ఆర్టికల్ కూడా వచ్చింది. ఆ ఆర్టికల్ క్లిప్పింగ్‌ను పరంజాయ్ గుహా అనే జర్నలిస్ట్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వింత ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
प्यार चाहिए या मटन चाहिए pic.twitter.com/JFJhRB1pbz
— ParanjoyGuhaThakurta (@paranjoygt) December 1, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com