ఆన్లైన్ మోసాలు... బ్రహ్మీని బాగా వాడేసిన పోలీసులు.. !

బ్రహ్మానందం.. ఈ పేరు చెప్పగానే ఆటోమేటిక్ గానే మనకి నవ్వొస్తుంది. వెండితెర పైన హాస్యనటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన... గత కొద్దికొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్నారన్న మాటే కానీ అభిమానులకి మాత్రం కాదు.. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కరలేదు.. అయన ఫోటోలను భీభత్సంగా వాడుతూ మీమ్స్ చేస్తుంటారు చాలా మంది. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కావాలన్నా సరే.. బ్రహ్మీ పిక్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు నెటిజన్లు..
తాజాగా ఆయన క్రేజ్ ను హైదరాబాదు పోలీసులు కూడా గట్టిగానే వాడేశారు. ఆన్‌లైన్ వేదికగా ఉద్యోగాలంటూ.. జరుగుతున్న మోసాల దృష్ట్యా జనాలకి అవగాహన కల్పించేందుకు హైదరాబాదు సిటీ పోలీసులు.. పలు సినిమాల్లో బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను వాడుకుంటూ ఓ ప్రత్యేకమైన వీడియోని రూపొందించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Beware Of Fraud Jobs pic.twitter.com/45c11YmqcA
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 3, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com