నగర పోలీస్ నయా ట్రెండ్.. అయ్యయో వద్దమ్మా..

నగర పోలీస్ నయా ట్రెండ్.. అయ్యయో వద్దమ్మా..
ఈ మధ్య ఎంత మంచి విషయం అయినా మామూలుగా చెప్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే అందరూ క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు.

ఈ మధ్య ఎంత మంచి విషయం అయినా మామూలుగా చెప్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే అందరూ అన్ని విషయాల్ని క్రియేటివ్‌గా చూడడం మొదలుపెట్టారు. అందులో మన హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. లేటెస్ట్‌గా ఏది ట్రెండ్ అవుతున్నా దానికి మార్పులు చేర్పులు చేసి ప్రజలకు అవగాహన కల్పించడంలో మన పోలీసులు తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు.

అలా ఈ మధ్య ట్రెండ్ అయిన ఒక వీడియోను ఉపయోగించి నకిలీ లింక్స్‌పై అవగాహన కల్పిస్తూ ట్విటర్‌లో ఒక మీమ్‌ను పోస్ట్ చేసారు హైదరాబాద్ సిటీ పోలీస్. అయ్యయో వద్దమ్మా అని ఒక ప్రకటనలో వచ్చే డైలాగ్ ఇటీవల కాలంలో చాలా వైరల్ అయ్యింది. ఒక కుర్రాడి వల్ల ఈ డైలాగ్ మరింత పాపులర్ అయ్యింది. ఆ డైలాగ్‌ను ఉపయోగిస్తూ ఏ లింక్ పడితే ఆ లింక్‌ను ఓపెన్ చేయొద్దని చెప్పుకొచ్చారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story