Hyderabad Traffic Police: 'హెల్మెట్ తప్పనిసరి.. తగ్గేదే లే..'

Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు సంరక్షణ కోసం కఠినమైన ఆంక్షలు విధిస్తారు. అవి కచ్చితంగా పాటించేలా చూస్తారు కూడా. కానీ ఈ ఆంక్షలు గురించి ప్రచారమే చాలా వినూత్నంగా చేస్తారు. ఇప్పటికే చాలాసార్లు ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌ను తీసుకొని ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు మరోసారి 'పుష్ప' మూవీ పోస్టర్‌తో అదే రిపీట్ చేశారు.
పుష్ప సినిమా ఇటీవల కాలంలో ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించిన పుష్ప.. 2021కు మంచి గుడ్‌బై చెప్పేలా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉన్నా కూడా ఇంకా థియేటర్లలో చూస్తున్నవారు చాలామందే ఉన్నారు. అందుకే ఈ సినిమా క్రేజ్‌ను ఉపయోగించి హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ డిఫరెంట్ ఐడియాతో ప్రజల ముందుకు వచ్చారు.
పుష్ప నుండి విడుదలయిన ఫస్ట్ లుక్‌ను తీసుకొని, దాన్ని కాస్త ఎడిట్ చేసి.. 'హెల్మెట్ తప్పనిసరి.. తగ్గేదే లే' అన్న క్యాప్షన్‌తో తమ ట్విటర్‌లో షేర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతకు ముందు కూడా పుష్పలోని రెండు పోస్టర్లతో నిబంధనలను చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు.. ఈ సినిమా పోస్టర్‌ను ఉపయోగించడం ఇది మూడోసారి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీని ప్రజలు ఎప్పటికప్పుడు ప్రశంసిస్తున్నారు.
#HYDTPweBringAwareness
— Hyderabad Traffic Police (@HYDTP) January 14, 2022
Wear Helmet. It saves you #WearHelmet #Helmet #ThaggedheLe@jtcptrfhyd @dcptraffic1hyd. pic.twitter.com/VyGMUY43O8
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com