Mask : డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే...!
Mask : ఈ మధ్య ట్రాఫిక్ మరియి కరోనా నిబంధనలు వంటి అంశాలపైన జనాలకి అవగాహన కల్పించడానికి అధికారులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

Mask : ఈ మధ్య ట్రాఫిక్ మరియి కరోనా నిబంధనలు వంటి అంశాలపైన జనాలకి అవగాహన కల్పించడానికి అధికారులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సినిమాల్లో బాగా పాపులర్ అయిన డైలాగ్స్ మీమ్స్ గా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా అదే పనిచేసింది.
కరోనా పైన ప్రజలకి సమాచారం అందిచేందుకు '#IndiaFightsCorona @COVIDNewsByMIB' పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్ పేజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ అయిన 'తగ్గేదేలే' డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది.
సినిమాలో అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే డైలాగ్ స్టిల్‌ను ఎడిట్ చేసి హీరోకి మాస్క్ పెట్టారు. ఈ ఫొటోపైన ''డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే'' అని రాశారు. ఈ మీమ్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కొవిడ్‌పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి'' అంటూ పోస్ట్ చేసింది.
దీనిని హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నాకి ట్యాగ్ చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ మీమ్ నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
#Pushpa..#PushpaRaj ho ya koi bhi,
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 19, 2022
Our fight against #COVID19 is still on!
🛡️Keep following #COVIDAppropriateBehaviour 👇
✅Always wear a #mask
✅Wash/sanitize hands regularly
✅Maintain distancing
✅Get fully #vaccinated#IndiaFightsCorona #We4Vaccine @alluarjun @iamRashmika pic.twitter.com/Mlzj9tnWL5
RELATED STORIES
Shalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్‌కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్‌గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMT