Video Viral: వాటే టాలెంట్ గురూ.. ఆమె ప్రతిభకు ఐఏఎస్ అధికారి ఫిదా..
video viral: భారతీయ మహిళ అద్భుతమైన ఆవు పేడ విసిరే నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు IAS అధికారి అవనీష్ శరణ్. ఆమె అంత ఎత్తుగా ఉన్న గోడపైకి పిడకలు వేసే విధానం బాస్కెట్‌బాల్‌ను గుర్తు చేస్తుంది అని వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాన్ని నడిపించే వ్యక్తులకు అసాధారణ ప్రతిభ ఉంటుంది. వారిలో ఆ టాలెంట్ ఉన్న విషయం వారికి కూడా తెలియదు.. అది వారి దినచర్యలో భాగంగానే చూస్తారు తప్పింది దానిని ఒక గొప్ప టాలెంట్‌గా భావించరు. కష్టపడి పని చేయడం, కుటుంబాన్ని పోషించుకోవడం అంతకు మించి వారికేమీ తెలియదు. వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభకు పదునుపెట్టే వ్యక్తులు ఎక్కడో గాని తారసపడరు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ అలాంటి నైపుణ్యాన్ని తెలియజేస్తోంది.
బుధవారం, IAS అధికారి అవనీష్ శరణ్, ఒక మహిళ ఆవు పేడ పిడకలను ఆరబెట్టడానికి గోడపై కొడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె అద్భుతంగా ఆవు పేడ పిడకలను గోడపై పైకి విసురుతోంది. అవి ఒకే వరుసలో గోడపై అంటుకుంటున్నాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ఆవు పేడ పిడకలను వంటకు ఇంధనంగా ఉపయోగిస్తారు.
ఈ 15-సెకన్ల క్లిప్‌ను షేర్ చేస్తున్నప్పుడు, శరణ్ మహిళ యొక్క ప్రతిభను ప్రశంసించారు. "భారత బాస్కెట్ బాల్ జట్టు ఆమె కోసం వెతుకుతోంది" అని రాశారు. శరణ్ పోస్ట్ చేసిన వీడియో ఒక రోజులో 1.1 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. 38,000 లైక్‌లను సేకరించింది. ఈ వీడియోలో చూపిన మహిళ నైపుణ్యాలను చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ, ఒక ట్విటర్ వినియోగదారు ఇలా వ్రాశారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.. కొందరు మాత్రమే వెలుగులోకి వస్తారు అని రాసుకొచ్చారు. అయితే, శరణ్ ట్వీట్‌ను కొందరు విమర్శించారు. పేదరికాన్ని వెక్కిరిస్తున్నారని ఆరోపించారు.
Indian basket ball team is searching for her. pic.twitter.com/hE2dBy7nAu
— Awanish Sharan (@AwanishSharan) June 29, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com