శభాష్ బిడ్డా.. కుటుంబ పోషణ కోసం 22 ఏళ్లకే బస్సు డ్రైవర్ అయింది!

ఇండియాలో అత్యధిక జనాభా గల నగరాలలో కలకత్తా ఒకటి.. అలాంటి నగరంలో వాహనాలు నడపడం అంటే అంత సులభం కాదు.. అందులోనూ మళ్ళీ బస్సు నడపడం అంటే అది మామూలు విషయం కూడా కాదు. అయితే ఓ 22ఏళ్ల అమ్మాయి మాత్రం.. ఇరుకైనా రోడ్లపైన కూడా బస్సును రయ్ రయ్ అంటూ తిప్పుతుంది. ఆ అమ్మాయి పేరు కల్పా మొండల్.. ఈ అమ్మాయి తండ్రి సుభాష్ మండల్ రెండేళ్ళ క్రితం ఓ ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీనితో అతని రెండు కాళ్ళకు రాడ్స్ వేసి ఆపరేషన్ చేయడంతో అతను వాహనలు నడపలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడడంతో తనకు ఇద్దరు అన్నలు ఉన్నాగానీ.. నేనున్నానంటూ ముందుకు వచ్చి తన కుటుంబ బాధ్యతను తీసుకుంది. కుటుంబ పోషణకు గాను డ్రైవర్ గా చేరాలని అనుకుంది. కానీ వయసు చిన్నది కావడంతో ఎవరు నమ్మలేదు. కానీ ఓ బస్సు ఓనర్ మాత్రం కల్పన మొండల్ కి అవకాశం ఇచ్చాడు. అతను ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా రోడ్లపై చాలా చక్కగా నడిపి అతని నమ్మకాన్ని నిలబెట్టింది. అలా డ్రైవర్ గా చేసి సంపాదించిన డబ్బుతోనే ఇప్పుడు తన కుటుంబం నడుస్తోంది.
కూతురు చేస్తున్న ఈ గొప్ప పనికి తండ్రి సుభాష్ మండల్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆమె భవిష్యత్ నే మా కుటుంబంకోసం ధారబోస్తోందని భాగోద్వేగానికి లోనయ్యారు. ఇక కల్పా మొండల్ డ్రైవర్ గా పనిచేస్తున్నప్పటికీ చదువును మాత్రం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడం లేదు. భవిష్యత్తులో తానూ పోలీసు డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ గా పనిచేయాలని అనుకుంటున్నానని.. దానికి కావాల్సిన కనీస విద్యార్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com