Jagan Flexy ​: జగనన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ ఫ్లెక్సీలు

Jagan Flexy ​: జగనన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ ఫ్లెక్సీలు
Jagan Flexy : జగన్‌ అన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ వెలసిన ఫ్లెక్సీలు.. తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Jagan Flexy : జగన్‌ అన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ వెలసిన ఫ్లెక్సీలు.. తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలో హాట్‌ టాపిక్‌గా మారాయి. అనపర్తి కెనాల్‌ రోడ్‌ మరమ్మతులు చేయాలంటూ.. గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన ఈ ప్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. అనపర్తి-బలభద్రపురం మధ్యలో గుంతలు ఉన్న చోట.. జగన్‌ అన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదం కావడంతో పోలీసులు ఫ్లెక్సీలను తొలగించారు. తెల్లవారుజామున ఈ ఫ్లెక్సీలు పెట్టి ఉంటారని భావిస్తున్న పోలీసులు.. దీనిపై సమాచారం ఉన్నవారు తెలియజేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story