శుభమా అని పెళ్లి చేసుకుంటే.. నవ దంపతులను క్వారంటైన్‌లోకి పంపిన కరోనా

శుభమా అని పెళ్లి చేసుకుంటే కరోనా నవ దంపతులను క్వారంటైన్‌కి పంపించింది. ఆశీర్వదించడానికి వచ్చిన అతిధులు కొవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. చంపావత్ జిల్లాలోని ఛేరా గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి వేడుక జరుగుతున్న టైంలో అధికారులు కొవిడ్ రిపోర్టుతో నేరుగా మండపానికి వచ్చారు. వరుడికి కొవిడ్ పాజిటివ్ అనే విషయాన్ని అధికారులు వారికి వెల్లడించారు. దీంతో ఆ వేడుకకు హాజరైన అతిధులు అవాక్కయ్యారు.
దిల్లీలో ఉంటున్న పెళ్లికొడుకు.. పెళ్లికి రెండు రోజుల ముందే తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే.. ఇంటికి వెళ్తున్న సమయంలో దగ్గరలోని చంపావత్ పట్టణంలో కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. నమూనాలు ఇచ్చి ఇంటికి వెళ్లిన అతను.. పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడు. పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో అధికారులు వచ్చి పెళ్లికొడుకి పాజజిటివ్ అని చెప్పారు. అయితే, కొవిడ్ నిబంధనల ప్రకారం, మిగిలిన వివాహ ఆచారాలను పూర్తిచేసిన అనంతరం నవదంపతులను క్వారంటైన్‌కు పంపిచారు అధికారులు. పెళ్లికి హాజరైన వారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com