Video Viral: ఆటగాళ్ళకు అవమానం.. టాయిలెట్‌లో ఆహారం

Video Viral: దేశ కీర్తి ప్రతిష్టలను వినువీధుల్లో ఎగురవేసే క్రీడాకారులకు ఘోర అవమానం జరిగింది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల రాష్ట్ర స్థాయి U-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడాకారులపై చిన్న చూపిన అధికారుల అలసత్వం కళ్లకు కడుతోంది.
క్రికెట్ ఒక్కటే క్రీడ అయినట్లు దానికి మాత్రం భారీ స్థాయిలో ప్రచారం, పేమెంట్ ఉంటుంది. దేశంలో క్రికెట్ అనేది ఒక మతమని, క్రికెటర్లను దేవుళ్లలా చూస్తారు. అలా అని ఇతర క్రీడలకు తగిన గుర్తింపు లేకపోవడం విచారకరం.
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్నారు అధికారులు. జూనియర్ కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్‌లో భోజనం అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహరాన్‌పూర్ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలన్నీ 'పూర్తిగా నిరాధారమైనవి' అని కొట్టిపారేశారు. "ఇక్కడ ఆటగాళ్లకు అందించే ఆహారం నాణ్యమైనది." కొంతమంది ఆటగాళ్ళు ఈ సమస్యను లేవనెత్తిన తర్వాత కుక్‌లను సక్సేనా మందలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com