Kacha Badam Singer: 'అవి చూసి గర్వం తలకెక్కింది'.. తప్పు తెలుసుకున్న కచ్చా బాదం సింగర్..

Kacha Badam Singer: అవి చూసి గర్వం తలకెక్కింది.. తప్పు తెలుసుకున్న కచ్చా బాదం సింగర్..
Kacha Badam Singer: తానొక సెలబ్రిటీ అనుకోవడం కంటే పల్లీలు అమ్ముకునే వ్యక్తి అనుకోవడమే మంచిది అంటున్నాడు భూజన్.

Kacha Badam Singer: ఈరోజుల్లో ఒక మనిషిని సెలబ్రిటీ చేయాలన్నా.. వారిని సెలబ్రిటీ స్టేటస్ నుండి దించేయాలన్నా.. సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సోషల్ మీడియా వల్ల ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో.. ఎవరి ప్రొఫైల్ ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. అలాగే ఒక్క పాటతో ఒక్కసారిగా పల్లీలు అమ్ముకునే స్థాయి నుండి మోస్ట్ వాంటెడ్ సింగర్ స్థాయికి వెళ్లిపోయాడు కచ్చా బాదం సింగర్ భూబన్.

కచ్చా బాదం పాటను భూబన్ పాడుతుండగా ఒకరు వీడియో తీయడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. ఆ పాటను ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లాగా మార్చడం.. అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో భూబన్‌కు సెలబ్రిటీ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అందుకే సాదాసీదాగా ఉండే తన లుక్‌ను పూర్తిగా మార్చేసి పాష్ లుక్‌లోకి మారిపోయాడు. కానీ అవన్నీ వాస్తవాలు కాదనే సత్యాన్ని ఇప్పటికి తెలుసుకున్నాడు భూబన్.

తానొక సెలబ్రిటీ అనుకోవడం కంటే ఇప్పటికీ తానొక పల్లీలు అమ్ముకునే వ్యక్తి అనుకోవడమే మంచిది అంటున్నాడు భూబన్. ఎటూకానీ వయసులో అనుకోకుండా వచ్చిన పేరు, డబ్బు తనను పైకి తీసుకెళ్లాయని, నాశనం చేయాలని ప్రయత్నించాయి అన్నాడు భూబన్. ఆ రంగు, హంగులు చూసి తనకు కూడా గర్వం తలకెక్కిందని, ఇప్పుడు నేలకు దిగొచ్చానని స్పష్టం చేశాడు.

కాస్త ఫేమ్, డబ్బు రాగానే భూబన్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఆ కారు వల్ల తనకు యాక్సిడెంట్ కూడా అయ్యి కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అప్పుడే తనకు తత్వం బోధపడి గాలిలో మేడలు కట్టకుండా మళ్లీ పల్లీలు అమ్మి బతకడానికి అయినా సిద్ధం అంటున్నాడు భూబన్. సోషల్ మీడియా అనేది ఎంత పని చేయగలదో భూబన్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని కొందరు అనుకుంటున్నారు.

Tags

Next Story