Rashmika Mandana: చిన్నారి చేసిన 'సామి సామి' డ్యాన్స్‌కు రష్మిక ఫిదా.. కలుస్తానంటూ..

Rashmika Mandana: చిన్నారి చేసిన సామి సామి డ్యాన్స్‌కు రష్మిక ఫిదా.. కలుస్తానంటూ..
Rashmika Mandana: సినిమాల్లో కొన్ని పాటలు, కొన్ని డైలాగులు, కొన్ని డ్యాన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి.

Rashmika Mandanna: సినిమాల్లో కొన్ని పాటలు, కొన్ని డైలాగులు, కొన్ని డ్యాన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులు, డ్యాన్సులు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తగ్గేదేలే అంటూ ప్రతి సందర్భంలో డైలాగుని చొప్పించే వారు కొందరైతే, సామి సామి అంటూ ఊగిపోయేవారు మరికొందరు.

తాజాగా ఓ స్కూల్ చిన్నారి కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసింది. కర్ణాటకకు చెందిన ఈ చిన్నారి డ్యాన్స్ చూసి రష్మిక ఫిదా అయ్యింది. పాపను కలుస్తానంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరి చేత కూడా డ్యాన్స్ చేయించింది చిన్నారి. పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్న ఈ పాపని చూసి వావ్.. సూపర్‌గా చేస్తున్నావు.. అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.. లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు.


Cute 😂😍#Rashmika ❤️ #Pushpa pic.twitter.com/TozeNSrGP5 #AlluArjun𓃵 @alluarjun

Tags

Next Story