ట్రాఫిక్‌ జరిమానా కోసం తాళిని తాకట్టు..!

ట్రాఫిక్‌ జరిమానా కోసం తాళిని తాకట్టు..!
ట్రాఫిక్‌ జరిమానా చెల్లించడానికి ఒక మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడింది.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ట్రాఫిక్‌ జరిమానా చెల్లించడానికి ఒక మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడింది.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని హుక్కేరి తాలూకా హుల్లోళిహట్టి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన భర్తతో కలిసి బైక్‌న బెళగావి మార్కెట్‌కు వెళ్ళింది.

అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. హెల్మెట్‌ లేదని పోలీసులు బైక్‌ను బస్టాండ్‌ వద్ద నిలిపేశారు. డాక్యుమెంట్లు చెక్ చేయకుండానే నేరుగా రూ.500 జరిమానా విధిస్తూ రసీదు చేతికందించారు. అప్పుడే మార్కెట్ కి వెళ్లి వస్తూ మార్కెట్ కి వెళ్ళిన వారి దగ్గర కేవలం వంద రూపాయలు మాత్రమే మిగిలాయి.

జరిమానా కింద ఈ వంద తీసుకొని వదిలేయండి అని బతిమిలాడారు. అయినప్పటికీ ఆ ట్రాఫిక్ పోలీసులు వినలేదు. ఫైన్‌ కట్టి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దాదాపుగా రెండు గంటల పాటు ఈ తంతు సాగింది.

దీనితో విసిగిపోయిన ఆ మహిళ తన మెడలో ఉన్న బంగారు తాళిని తీసి తన భర్త చేతిలో పెట్టి ఇది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్పింది. దీనితో అప్పుడే అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని వారిని వదిలేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags

Next Story