ఆత్మగా మారిన మైఖేల్ జాక్సన్..నా శరీరంతోనే అన్ని..మహిళ సంచలన వ్యాఖ్యలు

Michael Jackson's Ghost: దెయ్యం, భూతం, ఆత్మ ఇలా ఎలా పిలిచిన అన్ని ఒక్కటే.. వీటి పేరుతో సినిమాలు వస్తే వణుకుతూనే మూవీ మొత్తం చూస్తారు. వీటి గురించిన కథలు పుంఖాలు పుంఖాలుగా చెప్పుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నాయో లేవో తెలియని ఈ అదృశ్య శక్తులకు ముగింపు ఉండదు. అయితే యూకేకు చెందిన ఓ మహిళ ఓ ఆత్మ గురించి చెప్పింది. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు కథ ఉంది. ఆ మహిళ చెప్పిన ఆత్మ పేరు మైఖేల్ జాక్సన్. 2009లో జూన్ 25న గుండెపోటుతో మైఖేల్ జాక్సన్ మరణించిన సంగతి తెలిసిందే. మైఖేల్ జాక్సన్ ఆమెను ఆవహించారాంట.
యూకేకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే మహిళ దెయ్యంగా మారిన మైఖేల్ జాక్సన్ తనను పెళ్లి చేసుకున్నాడని.. తన శరీరంలో ప్రవేశించి డ్యాన్స్ చేయడం, తినడం, పాటలు పాడటం వంటి పనులు చేస్తున్నాడని తెలిపింది. మైఖేల్ జాక్సన్ ఆత్మ తన శరీరంతో శృంగారం తప్ప అని పనులు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
అంతేకాదు మార్లీన్ మన్రో పునర్జన్మ అని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన అన్ని అంశాలు ఓ వార్తా పేపర్ లో వచ్చింది. మైఖేల్ నాతో చాలా విషయాలు మాట్లాడతాడు. ''అతీతశక్తులకు సంబంధించి నా అనుభవాలను మీతో పంచుకోవలనుకుంటున్నాను. నేను దెయ్యంతో నివసిస్తున్నాను. ఆ దెయ్యం గురించి భూమ్మీద అందరికి తెలుసు. అది మైఖేల్ జాక్సన్'' అని తెలిపింది. మైఖేల్ అనుక్షణంతో నా మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధ క్షణాలను అతడు టాయిలెట్రైస్ అని పిలుస్తాడు. టీవీల్లో మనం చూసే మైఖేల్ జాక్సన్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు.
కానీ నాలో ఉన్న మైఖేల్ జాక్సన్ అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు'' అని తెలిపారు. నా శరీరంతో అన్ని పనులు చేస్తాడు. శృంగారం మాత్రం చేయడు. నేను ప్రయత్నిస్తే.. సాలీడు నీడ, శవాల ఆకారాలతో నన్ను భయపెడతాడు. నేను చేసే తప్పులను ఎత్తి చూపుతాడు'' అని తెలిపింది. కాథ్లీన్ చెప్పిన ఈ విషయాలన్ని గతేడాది ఓ న్యూస్ పేపర్‌లో ప్రచురించడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com