Kerala: భర్త డ్రైవర్.. భార్య కండక్టర్.. ఒకే బస్సులో ఉద్యోగం

Kerala: భర్త డ్రైవర్.. భార్య కండక్టర్.. ఒకే బస్సులో ఉద్యోగం
Kerala: భార్యా భర్తలు ఉద్యోగాలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం.. ఒక్కోసారి ఒకే ఆఫీసులో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు..

Kerala: భార్యా భర్తలు ఉద్యోగాలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం.. ఒక్కోసారి ఒకే ఆఫీసులో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు.. అయితే ఒకే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు చేసే వాళ్లు చాలా అరుదుగానే కనిపిస్తుంటారు.. కానీ కేరళకు చెందిన గిరి, తార అనే భార్యాభర్తలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు ఒకరు డ్రైవర్‌గా, మరొకరు కండక్టర్‌గా అది కూడా ఒకే బస్సులో.. ఈ బస్సు అన్ని ఆర్‌టీసీ బస్సుల్లా ఉండదు.. పెళ్లివారి బస్సులా ముస్తాబు చేసి అలంకరించి ఉంటుంది.. మనం బస్సులో ఎక్కి ప్రయాణిస్తున్నామన్న అనుభూతి కంటే ఏదో పిక్నిక్‌కి వెళుతున్నట్లు అనిపిస్తుంది.

అలాగే, ప్రయాణీకుల భద్రత కోసం ఆరు CCTV కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్‌లు, సౌకర్యవంతమైన ప్రయాణానికి మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్, పిల్లలను అలరించడానికి బొమ్మలు మరియు అలంకరణలు మరియు వాహనంలో LED డెస్టినేషన్ బోర్డ్‌ను అమర్చారు.

గిరి, తార తమ సొంత డబ్బు ఖర్చు చేసి ఈ బస్సును ఇలా అందంగా తీర్చిదిద్దారు. వీరికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వాస్తవానికి, ఈ బస్సులో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు అనేక వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించారు.

"ప్రతిరోజూ తెల్లవారుజామున 1.15 గంటలకు లేచి 2 గంటలకు డిపోకు చేరుకుంటాము," అని తారా వీడియోలో చెప్పారు. " గిరి బస్సును శుభ్రం చేస్తాడు. ఇద్దరికీ డ్యూటీ ఉదయం 5.50 గంటలకు ప్రారంభమవుతుంది," అని తారా చిరునవ్వుతో చెప్పారు. 20 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తార, గిరిలు ఇటీవలే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

గిరికి 26 ఏళ్లు, తారకు 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కలుసుకున్నారు. వారి వివాహం దాదాపుగా ఖాయం అయింది కానీ వారి జాతకాలు కలవలేదని కుటుంబసభ్యులు అభ్యంతరం పెట్టారు. కానీ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వారు వివాహం చేసుకున్నారు. తమ వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని తెలిపారు.

www.facebook.com/watch/?v=599750431616877

Tags

Read MoreRead Less
Next Story