వైరల్ వీడియో: ఆడి A4లో వచ్చి బచ్చలికూరను అమ్మిన రైతు..

వైరల్ వీడియో: ఆడి A4లో వచ్చి బచ్చలికూరను అమ్మిన రైతు..
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అంటే ఏంటో ఈ రైతుని చూసి నేర్చుకోవాలి. నెటిజన్లను సైతం ఆకర్షించిన ఈ రైతు కేరళకు చెందిన సుజిత్.

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అంటే ఏంటో ఈ రైతుని చూసి నేర్చుకోవాలి. నెటిజన్లను సైతం ఆకర్షించిన ఈ రైతు కేరళకు చెందిన సుజిత్. 'వెరైటీ ఫార్మర్' సుజిత్ ఎస్పీ గతంలో క్యాబ్ డ్రైవర్. పరిమిత జ్ఞానంతో వ్యవసాయంలోకి ప్రవేశించి భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో కూరగాయలు పండిస్తున్నాడు. వచ్చిన పంటను మార్కెట్ లో తానే స్వయంగా అమ్మి అటు వ్యాపారంలో మెళకువలను, ఇటు వ్యవసాయంలో అధిక రాబడి పద్దతులను తెలుసుకున్నాడు. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారే కొనే ఆడి కారును తానూ కొనుక్కున్నాడు. అందులోనే ఇప్పుడు తాను పండించిన పంటను మార్కెట్ కు తీసుకు వెళ్లి అమ్ముతున్నాడు.

అంకితభావం, కష్టపడే మనస్థత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే సుజిత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇటీవల ఓ క్లిప్‌ను పరిశీలిస్తే, సుజిత్ SP ఆడి A4ని నడుపుతూ కనిపించాడు.

అతని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తాజా బచ్చలికూరను పొలం నుండి కోసి తరువాత దానిని రోడ్డు పక్కన ఉన్న మార్కెట్‌లో విక్రయించడానికి తన ఆడి A4లోకి లోడ్ చేశాడు. మార్కెట్‌కు చేరుకున్న తర్వాత, నేలపై ఒక చాపను పరిచి దాని మీద ఎరుపు బచ్చలికూరను నైపుణ్యంగా ప్రదర్శించాడు. వచ్చిన కష్టమర్లకు అందించాడు. ఆకు కూరంతా అమ్మడం అయిపోయిన తరువాత చాప చుట్టేసి కారులో పెట్టుకుని వెళ్లిపోయాడు. అతని ముఖంలోని చిరునవ్వు నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

ఫోటో షేరింగ్ యాప్‌లో వీడియోను డ్రాప్ చేస్తూ, సుజిత్ ఎస్పీ పోస్ట్‌కి, “నేను ఆడిలో వెళ్లి బచ్చలికూర అమ్మినప్పుడు” అని క్యాప్షన్ ఇచ్చాడు. రెండ్రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కేరళ రైతు అతని విజయాన్ని ప్రశంసించారు. ఒక నెటిజన్ ఇలా వ్రాశాడు, “అర్థమైంది, నేను కూరగాయలు అమ్మడం కంటే ముందుగా ఆడిని కొనాలి”

మరొకరు.. భారతీయ రైతులందరూ ఇలాగే స్థిరపడాలని కోరుకుంటున్నాను. తాజా కూరగాయలు పండించి అమ్మాలి అని రాశారు.

Tags

Read MoreRead Less
Next Story