వీడియో వైరల్ : కేరళలో పోలీసు వాహనాన్ని చూసి పరుగులు తీసిన ముగ్గురు వ్యక్తులు..

అసలే కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. ప్రజలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ క్యారియర్లుగా మారుతున్నారు. మాస్కులు పెట్టుకోకపోగా.. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. తాజాగా కేరళలో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించకుండా బైక్‌పై ప్రయాణిస్తుండగా.... వారికి పోలీసు వాహనం ఎదురొచ్చింది. ఇంకేముందు.. బైక్‌కి బ్రేక్ ఒక్కసారిగా పడింది. వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు దిగిపోయారు. ఒక వ్యక్తి పరుగులు తీయగా.. మరో వ్యక్తి తనకేమీ సంబంధం లేదన్నట్లుగా రోడ్డు పక్కన నడచుకుంటూ అప్పటికప్పుడు మాస్క్ ధరించి అమాయకరత్నంలా వెళ్లాడు.
అయితే పోలీసులేమైనా సామాన్యులా? నేరుగా అతని వద్దకే వచ్చి ఏంటి సంగతి అని గద్దించారు. ఈ ఘటన తాలూకు వ్యవహారం అంతా పక్కనే కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను కేరళ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగితేనా.. ఫన్నీ కామెంట్ కూడా పెట్టారు. తప్పు చేయని వారు భయపడకూడదంటూ ఓ సినిమాలోని డైలాగ్‌ను పేల్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
തെറ്റ് ചെയ്യാത്തവർ പേടിക്കേണ്ടതില്ല ഗോപൂ...#keralapolice pic.twitter.com/9uC5zO3YzC
— Kerala Police (@TheKeralaPolice) April 16, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com