Kid Crying For Non Veg: ఈ బుడ్డోడికి నాన్ వెజ్ కావాలట.. ఎంత క్యూట్‌గా అడుగుతున్నాడో చూడండి..

Kid Crying For Non Veg: ఈరోజుల్లో వెజ్ తినేవారికంటే నాన్ వెజ్ తినేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా నాన్ వెజ్ అలవాటు అయినవారు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అయిన చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. ఈమధ్య చిన్నపిల్లలకు కూడా నాన్ వెజ్ బాగా అలవాటు అయ్యింది. ఓ పిల్లోడు అయితే నాన్ వెజ్ కావాలని ఏడుస్తూ అడిగిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి చికెన్ ఉండాల్సిందే. కొందరికి మటన్, ఫిష్ లాంటివి అయినా ఒకే. ఒకప్పుడు చిన్నపిల్లలకు నాన్ వెజ్ పెడితే.. జీర్ణం అవ్వడానికి ఇబ్బంది కలుగుతుందని ఎక్కువగా తినిపించేవారు కాదు. కానీ ఇప్పుడు పెద్దలకంటే ఎక్కువగా పిల్లలకే నాన్ వెజ్ అలవాటు అవుతుంది. ఈ బుడ్డోడికి కూడా అదే అలవాటు అయినట్టుంది. అందుకే ఏడుస్తూ వాళ్ల అమ్మను నాన్ వెజ్ కావాలని అడుగుతున్నాడు.
వైరల్ అవుతున్న వీడియోలో 'చికెన్, మటన్, బోటి, తలకాయ, కాళ్లు కావాలి' అని ఏడుస్తూ వాళ్ల అమ్మను అడుగుతున్నాడు. 'ఇవన్నీ కావాలా? కాకరకాయ తినవా?' అని అడిగితే కావాలని తల ఊపుతున్న అబ్బాయి వీడియో క్యూట్‌గా ఉండడంతో నెటిజన్లు దీనిని తెగ వైరల్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com