KL Rahul Athiya Marriage: అందాల జంట.. అమ్మడి లెహంగాకు 10వేల గంటలు..

భారత క్రికెటర్ KLరాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో సునీల్ శెట్టి కండాల ఫామ్‌హౌజ్‌లో కన్నుల పండుగగా వీరి వివాహం జరిగింది. ఈ చూడ చక్కని జంటను చూసినవారంతా వీరి లగ్గం స్వర్గంలోనే జరిగుంటుందని మురిసిపోతున్నారు.
హీరోయిన్ గా తనకంటూ ఓ ముద్రవేసుకోవాలని పరితపిస్తోన్న ఆతియా ఇంతలోనే ఇలా మనువాడి ఒకింటిదవుతుందని అభిమానులు అస్సలు ఊహించలేదు. ఏమైనా అమ్మాయి మాత్రం బ్రైడల్ వేర్ లో మెరిసిపోతోందనే చెప్పాలి. లేత గులాబీ రంగు చిక్కన్కారీ లెహెంగా ధరించిన ఆతియా దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తోంది. అయితే ఆతియా లెహంగాను తీర్చిదిద్దేందుకు డిజైనర్లు ఏకంగా 10వేల గంటలు వెచ్చించారట. ఇక ఐవరీ షేర్వాణీ ధరించిన రాహుల్ మస్త్ హ్యాండ్సమ్ గా కనిపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com