కొరియన్ పిల్ల నోట సారంగదరియా పాట..!

కొరియన్ పిల్ల నోట సారంగదరియా పాట..!
ఒక తెలుగు పాటకు ఇన్ని మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. సారంగదరియా విడుదలయ్యి ఇప్పటికీ చాలా రోజులు అయినా కూడా అందరూ ఇంకా దాన్ని ఆదరిస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం య్యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న పాటల్లో సారంగదరియా కూడా ఒకటి. ఒక తెలుగు పాటకు ఇన్ని మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. సారంగదరియా విడుదలయ్యి ఇప్పటికీ చాలా రోజులు అయినా కూడా అందరూ ఇంకా దాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడు ఆ పాటను ఒక కొరియా అమ్మాయి ఆలపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భాష రాకపోయినా తాను సారందరియా పాటను అంతగా ఇష్టపడి నేర్చుకుని పాడుతుండడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.


Tags

Next Story