Viral Note: రూ.10 నోటుపై ప్రియురాలి ప్రేమలేఖ.. సమయానికి ప్రియుడికి చేరుతుందా..?

Viral Note: రూ.10 నోటుపై ప్రియురాలి ప్రేమలేఖ.. సమయానికి ప్రియుడికి చేరుతుందా..?
Viral Note: నోటుపై ప్రేమలేఖలు కొత్తేమీ కాదు. కొన్నా్ళ్ల క్రితం కూడా ప్రేమ సందేశంతో ఒక నోటు ఇలాగే వైరల్ అయ్యింది.

Viral Note: ఒకప్పుడు తమ ప్రేమను అవతలి మనిషికి తెలియజేయడానికి పావురాలు ఉండేవి. పావురాలతో ప్రేమలేఖలు చేరవేయడం దగ్గర నుండి వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసుకునేంత వరకు కాలం మారిపోయింది. కానీ ఓ అమ్మాయి మాత్రం తన ప్రియుడికి రూ.10 నోటుపై లేఖ రాసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనను వచ్చి తీసుకెళ్లిపోమని తన ప్రియుడికి లేఖ రాసింది ఓ అమ్మాయి. ఆ నోటు ప్రేమలేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

నోటుపై ప్రేమలేఖలు కొత్తేమీ కాదు. కొన్నా్ళ్ల క్రితం కూడా ప్రేమ సందేశంతో ఒక నోటు ఇలాగే వైరల్ అయ్యింది. దానిపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ నోటు కూడా అలాగే ఫేమస్ అవుతుంది. ప్రస్తుతం ట్విటర్‌లో ఈ నోటు ఫోటో తెగ వైరల్ అవుతోంది. 'విశాల్.. నా పెళ్లి 26న జరగనుంది. అప్పటిలోపు నన్ను తీసుకెళ్లిపో. ఐ లవ్యూ. నీ కుసుమ్.' ఇక అప్పుడే సోషల్ మీడియాలో దీనిపై జోక్స్ మొదలయిపోయాయి.

ఈ నోటును షేర్ చేస్తూ ఓ వ్యక్తి 'ట్విటర్ నీ పవర్ చూపించు. 26 ఏప్రిల్ లోపు కుసుమ్ రాసిన ఈ లేఖ విశాల్‌కు చేరుకోవాలి. ఇద్దరు ప్రేమికులను కలపాలి. మీకు తెలిసిన విశాల్‌ను ట్యాగ్ చేయండి' అని ట్వీట్ చేశాడు. మరొకరు '26 ఏప్రిల్‌ రోజు కుసుమ్‌ను తీసుకెళ్లిపోవడానికి పదిమంది విశాల్‌లు వస్తారు' అని ట్వీట్ చేశాడు. ఇంకొకరు '26 ఏప్రిల్ కానీ ఏ సంవత్సరంలో? కుసుమ్ పెళ్లయిపోయి రెండేళ్లు అయ్యింటుంది. నోటు కూడా పాతగా ఉంది. పాపం విశాల్' అని ట్వీట్ చేశారు.


Tags

Next Story