నవ్వండి..కానీ టీకా తీసుకోండి... వైరల్ వీడియో పై డాక్టర్ ఏమన్నారంటే!

నవ్వండి..కానీ టీకా తీసుకోండి... వైరల్ వీడియో పై డాక్టర్ ఏమన్నారంటే!
అపోహల కారణంగా చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకాడుతున్న సమయంలో.. టీకా గురించి ఓ డాక్టర్, అతని భార్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది.

అపోహల కారణంగా చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకాడుతున్న సమయంలో.. టీకా గురించి ఓ డాక్టర్, అతని భార్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. ఈ సంభాషణ నెటిజన్లను నవ్వులు పూయించింది. పద్మశ్రీ గ్రహీత డా.కేకే అగర్వాల్ తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

అయితే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పేందుకు కాల్ చేయగా ఆమె మాత్రం తనకు కూడా టీకా వేయించాలి కదా అని గొడవపడింది. మీరొక్కరే టీకా వేయించుకుంటారా? నన్నెందుకు తీసుకెళ్లలేదని ఆమె అడగటం నెటిజన్లను నవ్వులు పూయిస్తుంది.

అయితే దీనికి అయన స్పందిస్తూ.. నేను టీకాను పరిశీలించడానికి వెళ్లాను. వారేమో నన్ను టీకా తీసుకోమన్నారు. అందుకే వేయించుకున్నాను' అంటూ ఏదో సర్ది చెప్పబోయారు. అయితే దీనికి ఆమె బదులు ఇస్తూ.. నాకు అబద్ధం చెప్పకండంటూ భర్త మాట వినడానికి నిరాకరించింది. ఇలా లైవ్‌ సెషన్‌లో రికార్డయిన ఈ భార్యభర్తల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ గా మారిన ఈ వీడియో గురించి తెలుసుకున్న కేకే అగర్వాల్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ఇంతటి క్లిష్ట సమయంలో మీ నవ్వులకు నేను, నా భార్య కారణమైనందుకు సంతోషంగా ఉంది. మీ వంతు వచ్చినప్పుడు మీలో ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని నేను కోరుతున్నాను అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story