సరైన విద్య, శిక్షణా లేకుండానే.. ఈ యువకుడు భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహార విప్లవాన్ని సృష్టిస్తున్నాడు..!

సరైన విద్య, శిక్షణా లేకుండానే.. ఈ యువకుడు భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహార విప్లవాన్ని సృష్టిస్తున్నాడు..!
ప్రస్తుతం పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న చాలా మంది ఒకప్పుడు కింది స్థాయి నుండి వచ్చిన వారే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ వ్యక్తి కూడా అదే కోవాలోకి వస్తాడు.

ప్రస్తుతం పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న చాలా మంది ఒకప్పుడు కింది స్థాయి నుండి వచ్చిన వారే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ వ్యక్తి కూడా అదే కోవాలోకి వస్తాడు. సరైన చదువు, శిక్షణ లేకుండా ఆఫీస్ బాయ్ నుండి ఒక సంస్థ ఫౌండర్ గా ఎదిగిన ఈ వ్యక్తి కథ ఎందరికో ఆదర్శం. అతనే సంతోష్ మంచాల. అమెరికాలో సంతోష్ "వెయిట్ వాచర్" అనే ప్రముఖ వెయిట్ లాస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు.. తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అదే సంస్థలో ఒక కస్టమర్ గా చేరారు. నిపుణులతో నేరుగా మాట్లాడటం ద్వారా.. అధిక బరువు యొక్క సమస్యలు, వాటి పరిష్కారాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మంచి ఫుడ్ డైట్ వంటి విషయాల గురించి మరింత తెలుసుకునే అవకాశం లభించింది ఆయనకి.


క్రమంగా.. సంతోష్ కుడా తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోని.. ఆరోగ్యవంతంగా మారాడు. భారతదేశంలోని తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో.. ఈ డైట్ ఫార్ములా గురించి వివరించగా.. ప్రస్తుతం ఇండియాలో వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉందని.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఆయన తెలుసుకున్నాడు. ఈ సమస్యని పరిష్కరించడానికి తానే ఒక వేదికను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన స్నేహితుల వద్ద నుండి కొంత ఆర్ధిక సహాయం తీసుకుని తానే స్వంతంగా ఓ "వెయిట్ లాస్" సంస్థని ప్రారంభించాడు. అదే "వెల్‌‌నెస్ ఆన్" వెయిట్ లాస్ సంస్థ.

ఈ "వెల్‌నెస్ ఆన్" అనేది ఒక వెబ్ సైట్ కం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఇందులో ప్రధానంగా యూజర్ మైండ్‌ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టేలా చేస్తారు. 1 వారం - 1 అలవాటు అనేది ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైనది. ఇందులో మనం తీసుకునే ఆహారంలోని పోషకాల సమతుల్యతకు సహాయపడే డాష్‌బోర్డ్ కూడా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం గురించిన పూర్తి సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఈ సంస్థలో మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే.. ఆరోగ్యకరమైన వంటకాలని రుచిలో రాజీ పడకుండా తయారు చేయడం జరుగుతుంది.


ఉదా:- అందరూ ఎక్కువగా ఇష్టపడే బిర్యానీని ఇక్కడ నిపుణులు చాలా తక్కువ నెయ్యిని, ఆహార రంగులు, కెమికల్స్ వంటివి వాడకుండా ఎంతో రుచికరంగా తయారుచేస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అదేవిధంగా.. అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారికోసం ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. అలాగే.. మార్కెట్‌లో లభించే చాలా రకాల స్నాక్స్ మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. మనలో చాలా మందికి భోజనం చేస్తూ మంచింగ్ కోసం స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అలాంటివి తినడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. అందులో అధిక ఉప్పు, పంచదార ఇంకా కృత్రిమ రుచులు, రసాయనాలు కలపడం, డీప్ ఆయిల్ ఫ్రై చేసినందున అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఈ సమస్యని అధిగమిస్తూ.. ఎలాంటి ట్రాన్స్‌ఫ్యాట్‌లు, చక్కెర వంటివి లేకుండా తక్కువ కేలరీలతో ఎక్కువ పోషక విలువలు కలిగిన స్నాక్స్ కూడా అందిస్తుంది ఈ "వెల్‌నెస్ ఆన్" సంస్థ. 2022 ముగింపు నాటికి తమ వ్యాపారాన్ని భారతదేశమంతటా విస్తరింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు సంస్థ యాజమాన్యం. హైదరాబాద్ లో తమకి వస్తున్న విశేష స్పందనని దృష్టిలో పెట్టుకుని మరో 3 బ్రాంచ్ లు ఓపెన్ చేయనున్నారు. చాలా మంది ప్రముఖులు, సెలమిబ్రెటీలు కూడా ఈ సంస్థకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story