వైరల్

Lip Lock Challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. ఆపై లైంగిక వేధింపులు.. 8 మంది అరెస్ట్..

Lip Lock Challenge: ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు.. ఓ అపార్ట్‌మెంట్‌లో గెట్ టుగెథర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

Lip Lock Challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. ఆపై లైంగిక వేధింపులు.. 8 మంది అరెస్ట్..
X

Lip Lock Challenge: మామూలుగా విదేశాల్లో ఎన్నో కొత్త రకమైన ఛాలెంజెస్‌ను మనం చూసే ఉంటాం. అందులో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి కూడా. అలా విదేశాల నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఇండియాలో కూడా చాలా ఛాలెంజెస్ జరిగాయి. అందులో ఒకటే లిప్ లాక్ ఛాలెంజ్. ఇటీవల కర్ణాటకలోని మంగళూరులో కాలేజీ విద్యా్ర్థులు లిప్ లాక్ ఛాలెంజ్ గురించి తెలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

మంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు.. ఓ అపార్ట్‌మెంట్‌లో గెట్ టుగెథర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే సరదాగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌ను మొదలుపెట్టారు. అందులో భాగంగా లిప్ లాక్ ఛాలెంజ్ అనే పేరుతో ఓ యూనిఫార్మ్‌లో ఉన్న విద్యార్థి.. విద్యార్థిని ముద్దుపెట్టుకున్నాడు. అక్కడే ఉన్న వారి స్నేహితులు ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. ఈ ఘటన జరిగి ఆరు నెలలు గడిచిన తర్వాత ఓ విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బాధిత విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది.

లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడే ఈ వీడియోను చూపించి పలువురు ఇద్దరు విద్యార్థినులపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో చట్టంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కాలేజీ యాజామాన్యాలకు సూచించారు పోలీసులు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES