పెట్రోల్ ధరలు పెంపు.. బైక్ ఇంజన్ పీకేసీ ఇలా సెట్ చేశాడు...!

పెట్రోల్ ధరలు పెంపు.. బైక్ ఇంజన్ పీకేసీ ఇలా సెట్ చేశాడు...!
పెట్రోల్ ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కొందరు తమ వాహనాలను ఓ మూలన పడేసి ప్రత్యామ్నాయాలను వెతుకుంటున్నారు.

పెట్రోల్ ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కొందరు తమ వాహనాలను ఓ మూలన పడేసి ప్రత్యామ్నాయాలను వెతుకుంటున్నారు. కానీ జనగామకి చెందిన ఓ వ్యక్తీ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు కూరపాటి విద్యాసాగర్‌. జనగామకు చెందిన వాసి, ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.


పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్‌ ఇంజన్‌ను తీసేయాలని ఫిక్స్ అయ్యాడు. రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్‌ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి ఆన్‌లైన్‌లో మోటారు కొన్నాడు. ఈ లోకల్‌ మేడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ 5 గంటలపాటు ఛార్జింగ్‌ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.Tags

Read MoreRead Less
Next Story