Madhya Pradesh: పెట్రోల్ ధరలు తట్టుకోలేక వెరైటీ విమానం కనుక్కున్నాడుగా..!

Madhya Pradesh: మిడిల్ క్లాస్ మనుషులపై ఇప్పటికే ఎన్నో భారాలు ఉన్నాయి. ఇప్పటికే వారు ఎన్నో రకాలుగా సర్దుకుపోతున్నారు. తాజాగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వారిపై మరో తీవ్ర భారంగా మారాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. ఇక డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు కూడా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.
మామూలుగా ఒక లీటరు పెట్రోల్ ఇప్పుడు ఏ మాత్రం సరిపోవట్లేదు. మరీ మైలేజ్ తక్కువగా ఇచ్చే ఖరీదైన బండ్లకు లీటర్ పెట్రోల్ అనేది చాలా తక్కువ మోతాదు. అలాంటి సమయంలో దూర ప్రయాణాలు చేయాలంటే వాహనదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రయాణం అంటే ఖర్చులు ఉండడం సహజమే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రయాణాలకు పెట్రోల్, డీజిల్ ధరలే పెద్ద సమస్యగా మారాయి.
తాజాగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తట్టుకోలేక మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించాడు. తన బైక్‌కు రెండు వైపులా రెండు చెక్కలు అమర్చాడు. వాటిపై అయిదుగురు మహిళలు, నలుగురు చిన్నారలను ఎక్కించుకుని రోడ్డుపై దూసుకుపోయాడు. ఇది చూసిన ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ దానిని వీడియో తీసి 'ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసిందని ప్రజలు కొత్త విమానాన్ని కనుక్కున్నట్టు ఉన్నారు' అని ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP
— Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021
ఇది చూసిన చాలామంది అతడి క్రియేటివిటీకి మెచ్చుకుంటున్నా.. మరికొందరు మాత్రం అది అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. అందుకే ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు ఎవరూ చేయకూడదు. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే వాహనాలు నడపాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com