Video Viral: పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ పాడు పనులా.. జంటను ఉతికి ఆరేసిన యాత్రికులు

Video Viral: అయ్యో రామ, అదీ ఇదీ అని లేదు.. ఎక్కడ చూసినా సరసాలేనా.. రాముడు పుట్టిన జన్మస్థలం అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తూ ఓ జంట తాము ఏం పని మీద వచ్చాము.. చుట్టూ ఎవరున్నారు అన్న సంగతి మర్చిపోయారు.. ముద్దు ముచ్చట్లలో మునిగిపోయారు.. గమనించిన యాత్రికులు ఆ జంటను చెడా మడా తిట్టారు.. యాత్రా స్థలంలో ఇదేం పాడు బుద్ది అని నాలుగు తగిలించారు..
భర్తను కొట్టొద్దంటూ భార్య వారించినా వినలేదు.. అతడికి లేదు బుద్ది.. నీకేమైంది తల్లీ అని ఆమెను కూడా తిట్టారు. అయోధ్యలో ఇలాంటి పనులు సహించేది లేదంటూ మరికొందరు ఆ జంట మీద ఫైరయ్యారు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళతామన్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయంపై విచారణ ప్రారంభిస్తామని అయోధ్య పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు. గంగా నది యొక్క ఏడు ఉపనదులలో సరయు ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. అయోధ్య రాముడి జన్మస్థలం సరయు నది ఒడ్డున ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com