Krabi: 10 కిలోల కోబ్రాను వట్టి చేతులతో పట్టుకొని వెళ్లిపోయాడు..

Krabi: 10 కిలోల కోబ్రాను వట్టి చేతులతో పట్టుకొని వెళ్లిపోయాడు..
Krabi: 10 కిలోల బరువు, 4.5 మీటర్ల బరువు ఉన్న కోబ్రా.. క్రాబి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు వచ్చేసింది.

Krabi: పాములను పట్టుకోవడం అంటే అది అంత మామూలు విషయం కాదు.. అది కూడా ఏ గ్లౌసులు వేసుకోకుండా వట్టి చేతులతో పట్టుకోవడం అంటే అస్సలు కాదు. కానీ దక్షిణ థాయ్‌ల్యాండ్‌లోని క్రాబి ప్రాంతానికి చెందిన సుతీ నేవాడ్ అనే 40 ఏళ్ల వ్యక్తి మాత్రం తనకు ఇదంతా సర్వ సాధారణం అంటున్నాడు. పాములను పట్టుకోవడానికి అతడు చేసిన స్టంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి.

10 కిలోల బరువు, 4.5 మీటర్ల బరువు ఉన్న కోబ్రా.. క్రాబి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు వచ్చేసింది. దానిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అప్పుడే ఆవో నంగ్ అనే రెస్క్యూ టీమ్ నుండి సుతీ నేవాడ్ సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. సెప్టిక్ ట్యాంకులో దాక్కుందామని వెళ్లిన ఆ పామును చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు.

ఆ కోబ్రాను సుతీ నేవాడ్ వట్టి చేతులతో పట్టుకోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే అలా చేతులతో పాములను పట్టుకోవడం చాలా ప్రమాదకరమని సుతీ చెప్తున్నాడు. దానికి చాలా చాకచక్యంగా ఉండాలని అతడు అన్నాడు. సుతీ వట్టి చేతులతో పామును మెడను పట్టుకుని బ్యాగ్‌లో వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story