వైరల్

viral video: ఖర్మ ఫలితం..గాడిద చేతిలో చావు దెబ్బలు.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ షేర్ చేసిన వీడియో వైరల్

viral video: బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శించి తక్షణ కర్మను ఎలా ఎదుర్కున్నాడో చూపించే వీడియోను పంచుకున్నారు.

viral video: ఖర్మ ఫలితం..గాడిద చేతిలో చావు దెబ్బలు.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ షేర్ చేసిన వీడియో వైరల్
X

viral video: చీమే కదా అని చిన్న చూపు చూడకు.. భారీ ఎనుగును కూడా ముప్పు తిప్పలు పెట్టగలదు. చెవిలో దూరిందంటే దానిక్కూడా ఏం చేయాలో పాలుపోదు. అన్నీతెలిసినా మనిషి అజ్ఞానంతో అవన్నీ మర్చిపోతుంటాడు.. దానిమొహం గాడిద ఏం చేస్తుంది అనుకున్నాడు కాబోలు.. చావు దెబ్బలు కొట్టాడు.. కొంత సేపు భరించింది. తగిన బుద్ధి చెప్తే కాని తాను చేసిన తప్పేంటో తెలుసుకోడు అనుకుందో ఏమో.. తిరిగి అతడిని కుమ్మేసింది. కాళ్లు నోట కరుచుకుని గిరా గిరా తిప్పి పడేసింది.

ఈ విచిత్రమైన సంఘటనలో, ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు తక్షణ కర్మను ఎదుర్కొన్నాడు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా గాడిదను కొట్టడం, తన్నడం వంటివి చేస్తున్నవీడియోను పంచుకున్నారు. ఆ తర్వాత జరిగినది ఊహించలేము.. తగిన శాస్తి జరిగింది అని సంతృప్తి చెందుతాము.

ఈ చిన్న వీడియో క్లిప్‌లో, ఒక వ్యక్తి గాడిదను క్రూరంగా కొట్టాడు. ఆ అభాగ్య జంతువు అతడు కొడుతున్న దెబ్బలను భరించింది. దాన్ని అన్ని చావు దెబ్బలు కొట్టి దానిపైన ఎక్కడానికి ప్రయత్నించాడు.. దీంతో గాడిదకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటి వరకు భరించాను.. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అని తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

కాళ్లను పళ్లతో గట్టిగా పట్టుకుని అతడిని బురదలోకి లాగింది. శక్తి కపూర్ పోస్ట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, "జైసీ కర్ణి వైసీ భర్ణి (మీరు ఏదైతే నాటుతారో అదే మొలకలుగా వస్తుంది" అని రాశారు)

ఇప్పటి వరకు, ఈ వీడియోను లక్షా 37 వేలమంది వీక్షించారు. గాడిద ప్రతీకారం తీర్చుకోవడం ఆశ్చర్యంగానే అనిపించినా.. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

RELATED STORIES