Madhya Pradesh: బైకులో నుండి పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Madhya Pradesh: బైకులో నుండి పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
X
Madhya Pradesh: అడివిలో ఉండాల్సిన ప్రాణులన్నీ ఇప్పుడు జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి.

Madhya Pradesh: ప్రాణంతో ఉన్న ఏ జీవి అయినా ఎక్కడికి అయినా వెళ్లగలదు. అలా అనుకుందో ఏమో మోటర్ బైకులోకి దూరింది ఓ పాము. విషపూరితమైన ప్రాణిగా భావించే పాములు ఈమధ్య జనాలు ఉండే చోటులోకే వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ భయపెట్టేస్తున్నాయి. ఇక తాజాగా బైకులో నుండి పాము బయటికి రావడాన్ని చూసి అందరూ వణికిపోతున్నారు.

అడివిలో ఉండాల్సిన ప్రాణులన్నీ ఇప్పుడు జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా అందరినీ హడలెత్తిస్తున్నాయి. అలాగే పాములు కూడా ఈమధ్య ఎక్కడ పడితే అక్కడ తారసపడుతూ జనాలను వణికిస్తున్నాయి. తాజాగా ఓ బైకులో దూరింది పాము. ఈ పామును బయటికి తీస్తున్న వీడియో చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపొడుస్తుంది అనడం ఖాయం.

మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. పార్క్ చేసిన బైకును తీసే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ అందులో నుండి ఏవో వింత శబ్దాలు రావడం గమనించాడు. సరిగ్గా చూస్తే బైకు హెడ్‌లైట్‌లో అతడికి ఓ పాము కనిపించింది. అది చూసి షాక్ అయ్యి పాములు పట్టేవాడిని పిలిపించాడు. పాములు పట్టేవాడు వచ్చి ఆ పామును బయటికి తీయగా అది కొండచిలువ అని అప్పుడు అర్థమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Tags

Next Story