Viral Video: ఎద్దుతో పెట్టుకున్నందుకు.. ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్

Viral Video: తానేదో పెద్ద హీరో అనుకున్నాడు. ఎద్దుని ఏం చేస్తానో చూడండి అంటూ అందరికీ తన బుద్ధి, బల ప్రదర్శనను చూపాలనుకున్నాడు.. కానీ అతడి పప్పులు ఏం ఉడకలేదు.. దానిమీద చెయ్యి వేశాడో లేదో కుమ్మిపడేసింది. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కయ్యారు అక్కడున్న వారంతా.
స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయాడు.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా తల మీద చేయి వేసి ఏదో చెప్పబోయాడు. దీంతో ఎద్దు ఒక్క ఉదుటున అతడిని తన కొమ్ములతో కుమ్మేసింది. కిందపడిన అతడిని చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. ఎద్దు.. ఇలాంటి వెధవ్వేషాలు నా దగ్గర పనికిరావన్నట్లు ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
బుల్‌ఫైట్ సందర్భంగా ఎద్దులను సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ కోడిపందాలు, బుల్‌పైట్‌లు చట్టబద్ధం. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Boom! pic.twitter.com/bNDaHsfwow
— Ricky Gervais (@rickygervais) August 28, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com