Divorce: గోల చేయలేదంట.. పెళ్లయిన 4 రోజులకే విడాకులు

Divorce: ఏంటో ఈ మధ్య పెళ్లి చేసుకోవడం.. వెంటనే విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పైగా ఆ విడాకులు తీసుకునే కారణాలు కూడా చాలా ఫన్నీగా ఉంటున్నాయి. తాజాగా ఇండోనేషియాకు చెందిన ఓ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నాలుగు రోజులకే విడాకులు తీసేసుకున్నాడు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే తను పెళ్లాడింది అమ్మాయిని కాదు రైస్ కుక్కర్‌ని..
అవును మీరు విన్నది నిజమే.. అతను పెళ్లాడింది ఒక రైస్ కుక్కర్‌ని. ఇతరుల భార్యల లాగా గోల చేయదని తనకు సమయానికి వండిపెడుతుందని ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనమ్ సోషల్ అనే కుర్రాడు ఫిలిప్స్ కంపెనీ రైస్ కుక్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక నాలుగు రోజులకే అది అన్నం మాత్రమే వండిపెడుతుందని, మిగతావేవి చేయట్లేదని కోపంతో విడాకులు కూడా ఇచ్చేసాడు. కానీ దీని వెనుక కూడా ఒక కథ ఉంది.
ఖోయిరుల్ అనమ్ సోషల్ మీడియాలో ఓ చిన్న సైజ్ సెలబ్రిటీ. అతడు పెట్టే ఫన్నీ కంటెంట్‌కు మిలియన్లలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేసేలా కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ వారిని అలరించడం అనమ్‌కు అలవాటు. అందులో భాగంగానే రైస్ కుక్కర్‌ను డమ్మీ పెళ్లి చేసుకొని, తరువాత దానికి విడాకులు ఇచ్చినట్టు ఫన్‌ను క్రియేట్ చేసాడు. దీంతో మరోసారి అనమ్ క్రియేటివిటీకి తన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com