వైరల్

viral video: అందమైన ప్రపోజల్.. ఆమె మారథాన్‌ పూర్తి చేస్తోంది.. అంతలో ప్రియుడు..

viral video: న్యూయార్క్‌లోని బఫెలో మారథాన్ ముగింపులో, క్రిస్టోఫర్ జేమ్స్ మోకాలిపై కూర్చుని, మాడిసన్ మహర్‌ని పెళ్లి చేసుకోమని అడిగాడు.

viral video: అందమైన ప్రపోజల్.. ఆమె మారథాన్‌ పూర్తి చేస్తోంది.. అంతలో ప్రియుడు..
X

viral video: రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తోంది నేటి యువత.. ప్రియురాలికి తన ప్రపోజల్ విషయం చెప్పాలంటే ఏ పార్కో అయితే సరిపోతుందనే రోజులకు కాలం చెల్లింది.. అంతర్జాతీయ వేదికలో, ఆడిటోరియంలో అయితే అందరూ చూస్తారు.. అతడు లేదా ఆమెకు తామిచ్చే అందమైన బహుమతి అదే అని ఫీలవుతున్నారు నేటి ప్రేమికులు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ క్రేజీ వీడియో..

ఒక వ్యక్తి తన స్నేహితురాలు మారథాన్‌ను పూర్తి చేస్తున్న సమయంలో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోను 'goodnews_movement' అనే పేజీ షేర్ చేసింది. ఈ వీడియోని ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల మంది వీక్షించారు. వేల లైక్‌లను అందుకుంది.

న్యూయార్క్‌లోని బఫెలో మారథాన్ ముగింపులో, క్రిస్టోఫర్ జేమ్స్ మోకాలిపై కూర్చుని, మాడిసన్ మహర్‌ని పెళ్లి చేసుకోమని అడిగాడు. క్రిస్ తన శిక్షణకు చాలా సహకరించాడని, తాను ప్రాక్టీస్ కోసం పరుగెడుతుంటే అతడు చాలా నెమ్మదిగా బైక్ నడుపుతూ తనను అడుగడుగునా ప్రోత్సహించాడని మ్యాడీ చెప్పింది. ఈ ప్రపోజల్ చాలా సింపుల్‌గా, బ్యూటీఫుల్‌గా ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

"ఆటలో ముగింపు రేఖ నా బెస్ట్ ఫ్రెండ్‌తో నా జీవితం ప్రారంభ రేఖగా మారింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, క్రిస్టోఫర్ జేమ్స్, "అని మ్యాడీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. మరొక పోస్ట్‌లో, క్రిస్ తనకు ఎలా మద్దతు ఇచ్చాడో తెలిపింది. నా శిక్షణ, నా రన్నింగ్‌కు క్రిస్ బ్యాక్‌బోన్‌లా వ్యవహరించాడు. అతడి సహకారం లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకు తెలియదు. కానీ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అతడే కారణం అని నాకు తెలుసు.

వారాంతాల్లో రేసుల కోసం ప్రయాణించడం, రేస్ డే లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడం, నా లాంగ్ రన్‌లలో గంటల తరబడి నాతో పాటు బైకింగ్ చేయడం, ఎప్పుడూ నేను పాస్తా తిందామన్నా నో చెప్పకపోవడం.. ఇలాంటి జీవిత భాగస్వామి దొరకడం నిజంగా నా అదృష్టం అని ఆమె రాసింది.

Next Story

RELATED STORIES