Viral News: సింహాన్ని భయపెట్టిన వ్యక్తి.. అది కూడా చిన్న కర్రతో.. వీడియో వైరల్..

Viral News: సింహాన్ని భయపెట్టిన వ్యక్తి.. అది కూడా చిన్న కర్రతో.. వీడియో వైరల్..
Viral News: కర్ర చూపించగానే సింహం పారిపోయింది అని చెప్తే వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు కదా.

Viral News: సింహం అంటే అడవికి రాజు. అందుకేనేమో సింహాన్ని దూరం నుండి చూడాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారు. విచక్షణ లేకుండా మనుషులు కనిపించగానే చంపి తినేసే క్రూరమైన సింహాలు కూడా మనుషులకు భయపడతాయి. కానీ అది చాలా సమయాల్లో సాధ్యం కాదు. కానీ తాజాగా అలాంటి సింహాన్ని ఒక కర్రతోనే భయపెట్టాడు ఓ వక్తి.

కర్ర చూపించగానే సింహం పారిపోయింది అని చెప్తే వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు కదా.. అంతే కాదు ఆ కర్ర పట్టుకున్న వ్యక్తిని చూసి సింహం దాడి చేయకుండా భయపడింది అంటే కూడా నమ్మడం కష్టమే కదా. నిజానికి అదే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలు తప్పు చేసినప్పుడు టీచర్ కర్ర పట్టుకొని నిలబడితే.. పిల్లలు ఎంత భయపడతారో.. ఆ సింహం కూడా అలాగే భయపడింది. అందుకే 'మనిషిని చూసి సింహం భయపడింది' అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.


Tags

Next Story