Indore : లాఠీ తీసుకొని పోలీసునే చితకబాదాడు : వీడియో వైరల్

Indore : లాఠీ తీసుకొని పోలీసునే చితకబాదాడు : వీడియో వైరల్
Indore : లాఠీ తీసుకొని ఏకంగా పోలీసునే వెంబడించి మరీ చితకబాదాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది..

Indore : లాఠీ తీసుకొని ఏకంగా పోలీసునే వెంబడించి మరీ చితకబాదాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఏండ్ల దినేష్ ప్రజాపతి, పోలీస్ కానిస్టేబుల్ జై ప్రకాష్ జైస్వాల్ బైకులు స్వల్పంగా ఢీకొన్నాయి.

ఈ క్రమంలో ఇద్దరు కింద పడిపోయారు.. దీనిపై ఆగ్రహించిన దినేష్.. జాగ్రత్తగా రైడ్ చేయాలంటూ కానిస్టేబుల్ జై ప్రకాష్ లాఠీ తీసుకొని అతనిపై దాడి చేశాడు.. అతనిని వెంబడించి మరీ లాఠీతో దాడికి దిగాడు.. ఈ దాడిలో కానిస్టేబుల్‌ జైస్వాల్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఇదంతా చూస్తున్న జనాలు ఒక్కరు కూడా ఆపడానికి ముందుకు రాలేదు.. కాగా ఈ ఘటన పైన కానిస్టేబుల్‌ జై ప్రకాష్ జైస్వాల్ ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రజాపతిని ఐపిసి సెక్షన్ 307 (హత్యప్రయత్నం) మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.

దినేష్‌కి ఏమైనా నేరచరిత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags

Next Story