Odisha: మొబైల్ ఫోన్ దొంగిలించాడని లారీకి కట్టి, చెప్పుల దండ వేసి..

X
By - Prasanna |25 May 2022 3:00 PM IST
Odisha: ఒడిశాలోని పారాదీప్‌లో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని కదులుతున్న లారీ ముందు కట్టేసి చెప్పులతో దండ వేశారు.
Odisha: ఒడిశాలోని పారాదీప్‌లో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని కదులుతున్న లారీ ముందు కట్టేసి చెప్పులతో దండ వేశారు.జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పరదీప్ లాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూతాముండై బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాహనంలో ఉన్న మొబైల్ ఫోన్‌ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. దీంతో సదరు వాహనదారుడు అతడిని ట్రక్కు ముందు బంధించి చెప్పులతో దండ వేసి కొన్ని నిమిషాల పాటు లారీ నడిపాడు.
ఈ ఘటనను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com