Mark Zuckerberg: ముచ్చటగా మూడోసారి... 2023లో ప్రేమతో అంటూ పోస్ట్....

ఫేస్‌బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నూతన సంవత్సరం వేళ శుభవార్తను పంచుకున్నారు. తాను మూడోసారి తండ్రి కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 2023లో తమ కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతోందని తెలిపాడు. గర్భవతి అయిన తన భార్య ప్రిస్సిల్లా చాన్ తో పాటూ ఓ పిక్ ను కూడా పోస్ట్ చేశాడు.
మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్సిల్లా చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్న వీరు, 2012లో వివాహం చేసుకున్నారు.
2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప 'ఆగస్ట్'జన్మించింది. ఇటీవలే వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం జుకర్ బర్గ్ దంపతులు మరో చిన్నారికి తల్లిదండ్రులవ్వబోతున్నారు.
మరోవైపు తన భార్య ప్రిస్కిల్లా చాన్ ను కౌగింలించుకున్న ఫోటోను పోస్ట్ చేసిన మార్క్ 'హ్యాపీ న్యూ ఇయర్.. మా ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో రాబోతున్నారు' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com